»Life Threat Calls To Singer Sunitha Husband Rama Krishna Veerapaneni And Complained To Banjara Hills Police
Singer సునీత భర్త Rama Krishnaకు ప్రాణహాని.. బెదిరిస్తూ సందేశాలు
కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్ చేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని అతడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
ప్రముఖ గాయని సునీత (Sunitha) భర్త, వ్యాపారవేత్త రామకృష్ణ వీరపనేనికి (Rama Krishna Veerapaneni) ప్రాణహాని పొంచి ఉంది. ఓ వ్యక్తి ద్వారా తనకు ప్రాణ హాని (Life Threat) పొంచి ఉందని ఆయన పోలీసులను ఆశ్రయించాడు. తనకు నిత్యం ఓ వ్యక్తి సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. హైదరాబాద్ (Hyderabad)లోని బంజారాహిల్స్ పోలీసులకు రామకృష్ణ ఫిర్యాదు చేశాడు.
ఓ వ్యక్తి ద్వారా తనకు, నా కుటుంబసభ్యులకు ప్రాణహాని ఉందని సునీత భర్త రామకృష్ణ ఆదివారం బంజారాహిల్స్ పోలీసులకు (Banjara Hills Police) ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-2లోని ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో (Women’s Cooperative Society) రామకృష్ణ నివసిస్తున్నాడు. అతడి ఫోన్ కు గతేడాది ఓ సందేశం వచ్చింది. తన పేరు కెకె లక్ష్మణ్ (KK Laxman) అని, తాను ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో సభ్యుడిగా పని చేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు. మీతో వ్యక్తిగతంగా కలవాలని ఆ సందేశంలో (Message) కోరగా.. రామకృష్ణ అంగీకరించలేదు. తాను కలవలేనని చెప్పేశాడు. అయినా వినకుండా సదరు లక్ష్మణ్ అనే వ్యక్తి తరచూ సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడు. అతడి వేధింపులు (Harrasment) తాళలేక రామకృష్ణ అతడి నంబర్ ను బ్లాక్ చేశాడు.
నంబర్ బ్లాక్ అతడు ఆగకుండా మరో నంబర్ (Phone Number)తో సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. మార్చి 28న కొత్త నంబర్ నుంచి బెదిరింపు సందేశాలు పంపడం ప్రారంభించాడు. అతడు తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో రామకృష్ణ పేర్కొన్నాడు. ఈ మేరకు రాత్రి బంజారాహిల్స్ పోలీసులు ఆశ్రయించారు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. ఫోన్ చేస్తున్న లక్ష్మణ్ అనే వ్యక్తి వివరాలు తెలుసుకుంటున్నారు. ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నాడని అతడిని అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. రామకృష్ణ వ్యాపారవేత్తగా కొనసాగుతున్నాడు. ఆయనకు పలు మీడియా సంస్థలతో సినిమా పరిశ్రమకు చెందిన పలు కంపెనీలు ఉన్నాయి. సినిమా వ్యాపారం ద్వారా సునీతతో పరిచయమై.. ఆమెను వివాహం చేసుకునే దాక చేరింది.