»Makthal Former Mla Kothakota Dayakar Reddy Health Condition Is Critical
మక్తల్ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి విషమం.. ప్రముఖుల పరామర్శ
తెలుగుదేశం పార్టీ నుంచి పూర్వ అమరచింత నియోజకవర్గం నుంచి 1994, 99లో రెండుసార్లు, మక్తల్ నుంచి 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్ రెడ్డి క్యాన్సర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు (Mahaboob Nagar District) చెందిన కీలక నాయకుడు, మక్తల్ (Makthal) మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి (Kothakota Dayakar Reddy) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ (Hyderabad)లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను స్వగ్రామానికి తరలించారు. ఇంట్లోనే అతడికి సంబంధించిన చికిత్సకు ఏర్పాట్లు చేశారు. ఆయన పరిస్థితి విషమించిందనే వార్త తెలుసుకున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రముఖ నాయకులు పరామర్శించారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నుంచి పూర్వ అమరచింత (Amarchinta) నియోజకవర్గం నుంచి 1994, 99లో రెండుసార్లు, మక్తల్ నుంచి 2009లో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన దయాకర్ రెడ్డి క్యాన్సర్ (Cancer) బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) చికిత్స పొందాడు. పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం స్వగ్రామం పర్కాపురం అతడిని తీసుకొచ్చారు. ఇంట్లోనే వైద్యులు వెంటిలేటర్ (Ventilator), ఇతర వైద్య పరికరాలు ఏర్పాటు చికిత్స అందిస్తున్నారు.
పరామర్శల వెల్లువ
అతడి పరిస్థితి విషమించడంతో ఆదివారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy), మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి (Manne Srinivas Reddy), మక్తల్, దేవరకద్ర, నారాయణపేట ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పరామర్శించారు. ఇంటికి విచ్చేసి దయాకర్ రెడ్డి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. దయాకర్ సతీమణి, మాజీ ఎమ్మెల్యే సీతతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి ఆరా తీశారు. ఇక మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, నాగం జనార్ధన్ రెడ్డి, టీడీపీ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భరతసింహారెడ్డి, బక్కని నర్సింహులు తదితరులు దయాకర్ రెడ్డిని పరామర్శించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశంలోనే దయాకర్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.