సమంత(Samantha) ఆరోగ్యం మళ్లీ చెడిందా? ఆమె మళ్లీ అనారోగ్య సమస్యలతో బాధపడుతోందా? ఆమెకు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో ఇదే చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha)కు ఏమైంది? ప్రస్తుతం సోషల్ మీడియా(social media)లో అదే చర్చ నడుస్తోంది. గత కొంతకాలంగా సమంత ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, ఆమె ఇటీవల కోలుకుందనే అనుకున్నారు. శాకుంతలం విడుదల సమయంలోనూ ఆమె జ్వరంతో బాధపడ్డాననే చెప్పింది. ఆ తర్వాత మళ్లీ బాగానే ఉందని అనుకునే లోపు.. ఆమె కొత్త ఫోటోలు(new pics) మళ్లీ అభిమానులను కలవరపెడుతోంది.
తాజాగా సమంత..గత వారం అంతా కూడా ఎలా గడిచిందో చెప్పేందుకు కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇందులో ఓ ఫోటోలో సమంత ఆక్సిజన్ మాస్క్(oxygen mask) పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దీన్ని హైపర్ బెరిక్ థెరపీ అని అంటారట. దీని వల్ల ఆటో ఇమ్యూనిటీ పెరుగుతుందట. అటీజం తగ్గుతుందట. న్యూరో డీజెనెరెటీవ్ కండీషన్ మెరుగు పడుతుందట. ఇన్ఫ్లామెషన్ తగ్గిస్తుందట. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందట. దెబ్బ తిన్న కణాలను తిరిగి మామూలు స్థితిలోకి తీసుకొస్తుందట.
అయితే సమంత తాజాగా ఇలా కనిపించడంతో మళ్లీ హాస్పిటల్లో జాయిన్ అయిందా? షూటింగ్‌లకు బ్రేక్ ఇస్తుందా? అని అంతా అనుకున్నారు. మళ్లీ ఆరోగ్యం తేడా కొట్టేసిందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో సమంత(Samantha) చేసిన కామెంట్లు అందరికీ తెలిసిందే. ఇంకా తన ఆరోగ్యం సెట్ అవ్వలేదని, స్టైల్ కోసం ఇలా అద్దాలు పెట్టుకోవడం లేదని, తాను లైట్‌ను కూడా భరించలేకపోతోన్నాను అని అందుకే ఇలా కళ్లద్దాలు పెట్టుకున్నానని చెప్పిన సంగతి తెలిసిందే.