»Veteran Actor Sarath Babu Dies At 71 In Hyderabad
Big Breaking సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత..
తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైనా దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘నిఝల్ నిజమగిరధు’ అనే తమిళ సినిమాతో శరత్ బాబుకు పేరు వచ్చింది. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ ను మొదట బెంగళూరులో చేర్పించారు.
కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సీనియర్ నటుడు శరత్ బాబు (71) (Sarath Babu) కన్నుమూశారు. హైదరాబాద్ (Hyderabad)లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో (Health Critical Condition) సోమవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. గతంలో వార్తా చానళ్లు (News Channels) చేసిన తొందరపాటుతో ఆయన మరణం అందరినీ కలచివేసింది.
31 జూలై 1951న జన్మించిన ఏపీలోని శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యంబాబు దీక్షితులు. తెలుగు (Telugu), తమిళం (Tamil), కన్నడ, మలయాళంతో పాటు హిందీ సినిమాల్లో కూడా నటించారు. దాదాపు 200కు పైగా సినిమాలు చేశారు. 1973లో తెలుగు సినీ పరిశ్రమకు (Tollywood) పరిచయమైనా దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్ (K Balachander) దర్శకత్వంలో వచ్చిన ‘నిఝల్ నిజమగిరధు’ అనే తమిళ సినిమాతో శరత్ బాబుకు పేరు వచ్చింది. కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శరత్ ను మొదట బెంగళూరులో చేర్పించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం తెలంగాణకు తరలించారు. హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో (AIG Hospital) చికిత్స పొందుతున్నారు. ఆయన చికిత్స పొందుతుండగానే కొన్ని చానళ్లు మరణించారని వార్తలు వేశారు. దీంతో వార్తా చానళ్లు, యూట్యూబ్ చానళ్లు, వెబ్ సైట్ ల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇచ్చిన పాత్రల్లో ఆయన ఒదిగిపోతారు. అందుకే ఆయన ఏకంగా 8 సార్లు నంది అవార్డులు (Nandi Awards) దక్కించుకున్నారు. రెండు దశాబ్దాల పాటు హీరోగా రాణించిన ఆయన అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాణించారు. మరో చరిత్ర, సాగర సంగమం, సంసారం ఒక చదరంగం, సీతాకోక చిలుక, అన్నయ్య, ఆపద్భాందవుడు, మూడుముళ్ల బంధం, శంకర్ దాదా జిందాబాద్ వంటి సినిమాల్లో కీలక పాత్ర పోషించారు. అతడు చివరిసారిగా నటించిన సినిమాలు వకీల్ సాబ్, మళ్లీ పెళ్లి. కాగా శరత్ బాబు మృతదేహాన్ని చెన్నైకి తరలించేందుకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు అంత్యక్రియలు జరుగుతాయని బంధువులు తెలిపారు.