ఆమె దురుసు ప్రవర్తన.. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై దాడికి పాల్పడడం వంటి వాటిపై షర్మిలపై పలు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై బాధిత మహిళా కానిస్టేబుల్, ఎస్సై స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సమాచారం. షర్మిల దాడికి పాల్పడడంతో పోలీస్ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆమె రాజకీయం కోసం పోలీసులపై దాడికి పాల్పడడం సరికాదని హితవు పలికాయి.
పోలీసులపై తెలంగాణ వైఎస్సార్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) దాడికి పాల్పడ్డారు. కానిస్టేబుల్ తో పాటు ఎస్సైపై (Sub Inspector) చేయి చేసుకున్నారు. అంతటితో ఊరుకోకుండా కారును ముందుకు పోనిస్తూ పోలీసులపైకి ఎగదోశారు. ఆమె ప్రవర్తన దురుసుగా ఉండడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఎస్ పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో ఏర్పాటుచేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను (SIT) కలిసేందుకు వెళ్తున్న సమయంలో షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు.
హైదరాబాద్ (Hyderabad)లోని లోటస్ పాండ్ (Litus Pond)లోని తన నివాసం నుంచి సోమవారం షర్మిల బయటకు వచ్చారు. అక్కడ ఉన్న పోలీసులు ఆమెను అడ్డగించారు. ఈ సమయంలో షర్మిల రెచ్చిపోయారు. అడ్డుకోబోయిన మహిళా కానిస్టేబుల్ (Constable) చెంప చెల్లుమనిపించారు. ఆమె వాహనం వెళ్లకుండా అడ్డగిస్తున్న పోలీసులపై తన కాన్వాయ్ (Convoy)ను ఎగదోశారు. డ్రైవర్ తో ‘తొక్కవయ్యా.. తొక్కుతావా లేదా.. వాళ్లపైకి వెళ్లు’ అని షర్మిల పోలీసులపై హత్యాయత్నానికి ప్రయత్నించారు. ‘హేయ్ చస్తే ఎవరు బాధ్యులు’ అంటూ ఎస్సై, కానిస్టేబుళ్లు అరిచారు. అయినా కూడా వినకుండా షర్మిల డ్రైవర్ ను కాదని ఆమె గేర్లు మార్చి కారు స్పీడ్ పెంచారు. వాహనం ముందుకు వెళ్లడంతో పోలీస్ సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడ్డారు.
అంతటితో ఆగకుండా షర్మిల ఎస్సైపై చేయి చేసుకున్నారు. ఆమె వెళ్లకుండా కారు తాళం తీసుకుంటే షర్మిల విచక్షణ కోల్పోయి ఎస్సైపై రెండు సార్లు చేయి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరు నువ్వు నన్ను కొట్టేందుకు.. ఎవరు మీరు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది. ఆమెను బలవంతంగా వాహనం ఎక్కించి జూబ్లీహిల్స్ పోలీసులకు (Jubilee Hills) తరలించారు. కాగా, ఆమె దురుసు ప్రవర్తన.. విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిపై (On Duty) దాడికి పాల్పడడం వంటి వాటిపై షర్మిలపై పలు కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. దీనిపై బాధిత మహిళా కానిస్టేబుల్, ఎస్సై స్టేషన్ లో ఫిర్యాదు చేశారని సమాచారం. షర్మిల దాడికి పాల్పడడంతో పోలీస్ సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆమె రాజకీయం కోసం పోలీసులపై దాడికి పాల్పడడం సరికాదని హితవు పలికాయి. షర్మిల పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పోలీస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.