»Telangana Medico Suicide Medico Preethis Brother Alleges She Was Murdered
Medoco Preethi: ప్రీతిది హత్యే.. ఆధారాలున్నాయన్న సోదరుడు
తన సోదరి ప్రీతిది ఆత్మహత్య ఏమాత్రం కాదని, హత్యేనని సోదరుడు చెబుతున్నారు. తన సోదరిది హత్య అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు.
medico preethi health is still critical says nims doctors
తన సోదరి ప్రీతిది (Medico Preethi) ఆత్మహత్య (Suicide) ఏమాత్రం కాదని, హత్యేనని (Murder) సోదరుడు చెబుతున్నారు. తన సోదరిది హత్య అనేందుకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, ఆత్మహత్య అని చెప్పడానికి వారి వద్ద ఏం ఆధారాలు ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. నిందితుడు సైఫ్ రిమాండ్ రిపోర్టులోను (Saif remand report) తప్పులు ఉన్నాయన్నారు. సైఫ్ (Saif) తన సోదరిని వేధించగా, ఈ విషయమై హెచ్ఓడీకి (HOD) ఫిర్యాదు చేస్తే, అతను కూడా ప్రీతినే తిట్టినట్లు చెప్పారు. పోలీసులు (Police) ఎవరినో కాపాడటానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సోదరికి విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేయాలని సైఫ్ ఆదేశించినట్టుగా వార్తలను తాను చూసినట్టుగా చెప్పారు. విశ్రాంతి లేకుండా డ్యూటీలు వేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలో ఉన్న హెచ్ఓడీ నాగార్జున పెద్ద చీటర్ అన్నారు. ప్రీతి సోదరుడు ఓ వీడియోను (Video) విడుదల చేశారు. తన సోదరికి, సైఫ్‌కు కలిపి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పడం అంతా అబద్ధమన్నారు. హెచ్‌వోడీ పిలిచి తన సోదరిని కనీసం ఎలాంటి వివరణ అడక్కుండా తిట్టాడన్నారు.
సైఫ్‌కు (Saif) పూర్తిగా మద్దతు ఇచ్చాడని, అలాంటి నాగార్జునరెడ్డితో కమిటీని ఏర్పాటు చేయడం సరికాదన్నారు. అలాంటి కమిటీని ఏర్పాటు చేస్తే సైఫ్‌కు అనుకూలంగానే నివేదిక ఇస్తాడని కుండబద్దలు కొట్టారు. నిమ్స్‌లో ప్రీతి పొత్తి కడుపు వద్ద సర్జరీ చేశారని, కానీ ఆ సర్జరీ ఎందుకు చేశారో తెలియడం లేదన్నారు. ప్రీతికి చేతిపై గాయం ఉందని, ప్రీతికి పూర్తిగా శరీరంలో బ్లడ్ డయాలిసిస్ చేశారన్నారు. బ్లడ్ డయాలసిస్ చేస్తే పోస్ట్ మార్టంలో ప్రీతి బాడీలో ఉన్న ఇంజెక్షన్ గురించి ఎలా తెలుస్తుందో చెప్పాలన్నారు. నిమ్స్‌లో (Nims) ప్రీతికి (Preethi) ఏం వైద్యం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ర్యాగింగ్ కమిటీపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. నాగార్జునరెడ్డి తప్పు చేసిన వ్యక్తి అని, అతనిని ర్యాగింగ్ కమిటీలో ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. తన సోదరి సెల్ ఫోన్లో సందేశాలను తాను చెక్ చేశానని, తనకు కనిపించని సందేశాలు పోలీసులకు ఎలా కనిపించాయో చెప్పాలన్నారు. నాగార్జున రెడ్డి కమిటీ రిపోర్ట్‌ను మార్చి ఉంటారన్నారు.
కాగా, జనగామ జిల్లాలోని కొడకొండ్ల మండలం గిర్నితండాకు చెందిన మెడికో విద్యార్థిని ప్రీతి నాయక్ (Preethi Nayak) తన సీనియర్ సైఫ్ (Saif) వేధింపుల కారణంగా బలైన విషయం తెలిసిందే. ఆమె మృతిని ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. తన సీనియర్ సైఫ్ వేధింపులకు ఆమె బలయ్యారు. సైఫ్ వేధింపులపై ప్రీతి వారిని నిలదీయడంతో టార్గెట్ చేశాడు. గత మూడు నాలుగు నెలలుగా పదేపదే వేధించడంతో పాటు వాట్సాప్ గ్రూప్ లలోను ఆమెపై పోస్టులు పెట్టాడు. అలా తనను టార్గెట్ చేయవద్దని ఆమె చెప్పినప్పటికీ సైఫ్ వినలేదు. మరింత రెచ్చిపోయాడు. తల్లిదండ్రులకు కూడా తన బాధను చెప్పుకున్నారు. యాజమాన్యంతో మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ, నిందితుడి తీరు మారలేదు. ఇలాంటి తరుణంలో ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసి, ఐదు రోజుల పాటు హాస్పిటల్ లో చికిత్స పొంది, చివరకు కన్నుమూశారు. కానీ ప్రీతిది ఆత్మహత్య కాదని, ఆమెది హత్య అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ కోణంలో దర్యాఫ్తును కోరుతున్నారు.