»Telangana Inter Results 2023 Effect Eight Students Suicide
Telangana:లో 8 మంది విద్యార్థుల ఆత్మహత్య..!
తెలంగాణలో నిన్న ఇంటర్ ఫలితాలు(telangana inter results 2023) వచ్చాయి. కానీ విషాదం చోటుచేసుకుంది. అయితే ఓ వైపు పాస్ అయిన వారు సంతోషంతో ఉంటే.. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు మాత్రం తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 8 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ఇంటర్ ఫలితాలు(telangana inter results 2023) మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 8 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని కొందరు, మార్కులు తక్కువగా వచ్చాయమని కొందరు ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం. పరీక్షల్లో తప్పడం వల్ల విద్యార్థులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కలచివేస్తోంది. వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హైదరాబాద్‌లో చదువుకుంటున్న గద్వాలకు చెందిన ఓ విద్యార్థి (17) ఇంటర్ ఫస్టియర్‌లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో ఉరేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఉంటూ ఇంటర్ (MPC) చదువుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థిని ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. పటాన్చెరులో ఇంటర్ (MPC) చదువుతున్న తిరుపతికి చెందిన విద్యార్థి (17) ఫెయిల్ అవుతానన్న మనస్తాపంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. మంగళవారం ఉదయం గుండ్ల పోచంపల్లి-మేడ్చల్ రైల్వే స్టేషన్ల మధ్య అతడి మృతదేహం లభ్యమైంది.
జగిత్యాలలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న విద్యార్థి (16) నాలుగు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ (Bipc) చదువుతున్న ఆర్మూర్ విద్యార్థి (17) మూడు సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించలేకపోవడంతో ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
సికింద్రాబాద్‌లో ఒకరు, ఖైరతాబాద్‌లో మరొకరు ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకోగా, నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన అమ్మాయి (17) మార్కులు తక్కువగా (365) వచ్చాయన్న మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అలాగే, పటాన్చెరు సమీపంలోని పాటి గ్రామానికి చెందిన విద్యార్థిని భవాని ఇంటర్ సెకండియర్‌లో ఫెయిల్ అయిన మనస్తాపంతో అదృశ్యమైంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి :TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో నలుగురు అరెస్ట్