»Tamannaah Dinner Dating With Vijay Varma Social Media
Tamanna Dating: విజయ్ వర్మ కారులో తమన్నా..ఏడాది నుంచి డేటింగ్?
ప్రముఖ హీరోయిన్ తమన్నా(tamannaah), బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ(vijay varma) కలిసి డేటింగ్(dating)లో ఉందని ప్రచారం జరుగుతోంది. ముంబైలో వీరిద్దరూ కలిసి నిన్న కారులో వెళుతున్న క్రమంలో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. అయితే గత ఏడాది నుంచి వీరు కలిసి తిరుగుతుండటం పట్లు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అవెంటో మీరు కూడా ఓసారి చూడండి.
మిల్క్ బ్యూటీ తమన్నా(tamannaah), విజయ్ వర్మ(vijay varma) సోమవారం రాత్రి డిన్నర్ డేట్‌కి వెళ్లారు. దీంతో ప్రస్తుతం ఈ నటీనటుల గురించి సోషల్ మీడియాలో డేటింగ్(dating) చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. వెలుగులోకి వచ్చిన వీడియోలో డ్రైవర్ సీటులో విజయ్ ఉండగా, తమన్నా పక్కనే కూర్చుంది. తమన్నా టూ టోన్ గ్రే ట్రౌజర్, వైట్ వెస్ట్ ధరించగా, విజయ్ బ్లాక్ టీ-షర్ట్‌పై ధరించిన బూడిద రంగు చెక్ షర్ట్‌లో ఉన్నాడు. ఆ క్రమంలో వారు కొద్దిసేపు ఫోటోగ్రాఫర్ల వైపు చేతులు ఊపారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఇద్దరూ సరైన జంట అని కామెంట్లు(comments) చేస్తున్నారు. మరో వ్యక్తి వాహ్ … కాఫీ అన్‌ప్రిడిక్టబుల్ అని ప్రశంసించారు. మరొకరు నిజమైన జంటలా కనిపిస్తున్నారని రాసుకొచ్చారు. ఇంకొవ్యక్తి అందంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వీరు కలిసి తిరుగుతున్న అంశంపై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అంతే కాదు తమన్నా, విజయ్ వర్మల డేటింగ్(dating) గురించి గత సంవత్సరం డిసెంబర్లో కూడా వార్తలు వచ్చాయి. ముంబైలో ఓ సంగీత కచేరీకి వీరిద్దరూ కలిసి అప్పట్లో హాజరైన నేపథ్యంలో అప్పుడు కూడా వీరు డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి. కానీ ఈ నటీనటుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా ఇప్పుడు కూడా వీరు మళ్లీ కలిసి కనిపించడంతో డేటింగ్ వార్తలు మళ్లీ మొదలయ్యాయి.
విజయ్ వర్మ(vijay varma) డార్లింగ్స్, గల్లీ బాయ్, పింక్, ఘోస్ట్ స్టోరీస్, సూపర్ 30, బాఘీ 3 వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అతని సినిమా పాత్రలతో పాటు విజయ్ వర్మ కొన్ని వెబ్ షోలలో కూడా నటించాడు. ప్రస్తుతం విజయ్ తన 8 భాగాల వెబ్ సిరీస్ దహాద్ విడుదల కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో సోనాక్షి సిన్హాతో పాటు గుల్షన్ దేవయ్య, సోహమ్ షా నటించారు. మే 12న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది.
బాహుబలి, దేవి, సైరా నరసింహా రెడ్డి వంటి కొన్ని చిత్రాలలో నటి తమన్నా(tamannaah) బాగా ప్రసిద్ది చెందింది. ఇక పని విషయానికొస్తే, తమన్నా తదుపరి నవాజుద్దీన్ సిద్ధిఖీతో కలిసి బోలే చుడియాన్‌లో నటిస్తుంది. నటి రితీష్ దేశ్ముఖ్తో కలిసి నెట్‌ఫ్లిక్స్ కామెడీ చిత్రం ప్లాన్ ఎ ప్లాన్ బిలో చివరిగా కనిపించింది.