»Vijay Varma Made Shocking Comments About Marriage With Tamannaah
Vijay Varma: పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్
తమన్నాతో ఎంతో కాలంగా ప్రేమలో ఉన్న నటుడు విజయ్ వర్మ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన వివాహం గురించి ఎలాంటి సమాధానం చెప్పలేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన కెరియర్ మీదనే ఫోకస్ పెడుతున్నా అని అనడంతో నెటిజన్స్ షాక్ అవుతున్నారు.
Vijay Varma made shocking comments about marriage with Tamannaah
Vijay Varma: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ (Vijay Varma) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్ స్టార్ నాని నటించిన ఎమ్సీఏ చిత్రంతో తెలుగు వారందరికి సుపరిచితుడు అయ్యారు. ఇక తన ప్రేమవ్యవహారం కూడా తెలిసిందే. ప్రముఖ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah)తో ఎంతో కాలంగా లవ్లో ఉన్నారు. ఆ మధ్య ముంబయిలో చాలా సార్లు మీడియాకు చిక్కారు ఈ ప్రేమ పక్షులు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పలు సందర్భాల్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో వీరికి ఎంగేజ్మెంట్ కూడా చేసేశారు నెటిజనులు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ వర్మ తమన్నాతో వస్తున్న పెళ్లి వార్తలపై స్పందించారు.
చాలా రోజులుగా ఎక్కడికెళ్లినా తనను ఇవే ప్రశ్నలు అడుగుతున్నారన్నారు. తనను పెళ్లి చేసుకోవడానికి ఏ అమ్మాయి సిద్ధంగా లేదని సరదాగా సమాధానం ఇచ్చారు. ఆయన వివాహం గురించి ఇంట్లో వాళ్లు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారని.. విజయ్ అమ్మ రోజు పెళ్లి గురించే అడుగుతుందని అన్నారు. ఇప్పటివరకూ తన తల్లికే ఎలాంటి సమాధానం చెప్పలేకపోయానని.. మీకు కూడా ఏమి చెప్పలేనని అన్నారు. దీంతో నెటిజనులు షాక్ అయ్యారు. అదేంటి తొందరలో గుడ్న్యూస్ వింటాము అనుకుంటూ విజయ్ వర్మ ఇలా అన్నాడు అని కాామెంట్లు చేస్తున్నారు. తన కెరియర్ గురించి మాట్లాడుతూ.. మన్సూన్ షూటౌట్ రిలీజ్ కోసం ఎదురుచూసిన రోజుల్లోనే ఎన్నో ఇబ్బందికర పరిస్థితులను చూశానన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తమ చిత్రానికి మంచి ప్రశంసలు దక్కడం చూసి జీవితం మారుతుందని అనుకున్నాడట, కానీ అలా జరగలేదు. మళ్లీ అవకాశాల కోసం ప్రయత్నాలు చేశానని చెప్పారు. ప్రస్తుతం తనకు మంచి పాత్రలు వస్తున్నాయని, తన ఫోకస్ అంతా పనిమీదనే ఉందన్నారు. నెట్ఫ్లిక్స్లో విడుదలైన లస్ట్ స్టోరీస్2 సిరీస్ షూటింగ్ టైమ్లో తమన్నా, విజయ్ వర్మ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ప్రేమగా మారింది. మరి వీరు ఎప్పుడు మూడుముళ్ల బంధంతో ఒక్కటి అవుతారో లేదో చూడాలి.