»Salar T Shirts In The Market For Prabhas Fans Do You Know The Price
Salar t-shirts: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండుగ.. మార్కెట్లో సలార్ టీ షర్ట్స్
ఆన్లైన్ వేదికగా సలార్ ప్రమోషన్లు మొదలయ్యాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మేకర్స్ వినూత్నంగా పబ్లిసిటీని స్టార్ట్ చేశారు. సలార్ పేరిట టీ షర్టులను అభిమానుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు. వీటి ధర ఎంత? ఎక్కడ లభిస్తాయో చూద్దాం.
Salar t-shirts in the market for Prabhas fans.. Do you know the price?
Salar t-shirts: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా సలార్(Salaar). చిత్రీకరణ పూర్తి చేసుకొని సలార్ పార్ట్ 1 డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఈ క్రేజీ కలయికలో వస్తున్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. బాహుబలి తరువాత ఆ రేంజ్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న సలార్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. దీనిలో భాగంగా మూవీ మేకర్స్ సలార్ టీ షర్ట్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. చిత్ర నిర్మాణ సంస్థ హొంబలె ఫిల్మ్స్ వెబ్ సైట్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఒక్కో టీ షర్ట్ ధర రూ.499 నుంచి రూ.1,499 వరకు ఉంది.
ఈ కలెన్లలో టీషర్టులు, హుడీలు, హార్మ్ స్లీవ్ లను అమ్మకానికి పెట్టారు. టీషర్ట్స్ ధర చూసి అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. అంత ఎక్కువ రేట్లు పెడితే ఎలా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. టీ షర్ట్ కొంటేనే అభిమానం ఉన్నట్లా అని కొంత మంది ప్రశ్నలు వేస్తున్నారు. ఇది పబ్లిసిటీలా లేదు, వ్యాపారంలా ఉందని మరికొంత మంది మండిపడుతున్నారు. అంత ధర పెట్టారు అంటే క్వాలిటీని మెయింటైన్ చేసుంటారు అని ఇంకొందరు అంటున్నారు. ఏదేమైనా డార్లింగ్ ఫ్యాన్స్ వాటిని కొనడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.