నిజమే.. బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న తమన్నాను చూసి ఒక్కసారిగా షాక్ అయిందట సమంత. అసలు సామ్ అక్కడికి ఎందుకెళ్లింది? తమన్నా ప్రస్తుతం ఎక్కడ ఉంటోంది? సామ్ ఎందుకు షాక్ అయింది? అనే వివరాలు ఓ సారి చూస్తే..!
Shocking.. Tamannaah's boyfriend who captured Samantha!
Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్న కూడా.. కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాతో దూసుకుపోతోంది తమన్నా. సినిమాలే కాదు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తోంది. ఇదిలా ఉంటే.. సినిమాల కంటే ఎక్కువగా ప్రేమ వ్యవహారంలో హాట్ టాపిక్ అవుతోంది తమన్నా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోంది తమ్మూ. ఎక్కడికెళ్లినా కలిసే వెళ్తోంది ఈ జంట. గతేడాది విడుదలైన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్‌లో విజయ్ వర్మ, తమన్నా జంటగా నటించి రెచ్చిపోయారు. అప్పటి నుంచి ఇద్దరు హాట్ టాపిక్ అవుతునే ఉన్నారు. కానీ పెళ్లి గురించి అడిగితే మాత్రం సమాధానం దాటేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు పెళ్లి కాకుండానే కలిసే ఉంటున్నారనే న్యూస్ ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా తమన్నా ఉన్న ఇంటికి నేరుగా వెళ్లిందట సమంత. అయితే అక్కడ విజయ్ వర్మ కూడా ఉండడంతో.. సమంత కాస్త షాక్ తిన్నంత పనైందట. అంతేకాదు.. ఈ వ్యవహారంతో తమన్న లివిన్ రిలేషన్లో ఉందనే మ్యాటర్ బయటకు వచ్చింది. ఇక సమంత, తమన్నా కలుసుకున్న ఫోటోలను విజయ్ వర్మ స్వయంగా తన కెమెరాలో బంధించడం విశేషం. ప్రజెంట్ ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా జరిగిన అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్లో కోసం సమంత వెళ్లగా.. తమన్నా దగ్గరకు వెళ్లినట్టు టాక్. అయితే.. ఇంత చేస్తున్న తమన్నా పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. ఈ ఏడాదిలోనే ఈ బోల్డ్ బ్యూటీ పెళ్లి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే తమన్నా ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే తమన్నా, విజయ్ వర్మ పెళ్లి కబురు రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.