కోలీవుడ్(Kollywood) హీరో శివకార్తికేయన్(Hero Sivakarthikeyan) సరికొత్త కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే ‘డాక్టర్ వరుణ్’, ‘ప్రిన్స్’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కార్తికేయన్ తాజా ఏలియన్ కథాంశంతో సినిమా చేస్తున్నాడు. ఆయన నటిస్తున్న కొత్త ప్రాజెక్టు అయలాన్ (Ayalan). ఈ మూవీకి ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(Rakulpreet singh) ఫిమేల్ లీడ్ రోల్ చేస్తోంది.
తాజాగా అయలాన్ మూవీ(Ayalan Movie) నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్(Poster Release) చేసింది. ఆ పోస్టర్ లో హీరో శివకార్తికేయన్(Hero Sivakarthikeyan) ఆకాశంలో విహరిస్తూ ఉంటాడు. అతడితో పాటుగా ఏలియన్ కూడా వెళ్తున్నట్లు పోస్టర్లో కనిపిస్తోంది. పోస్టర్ ను చూస్తే ఈ సారి శివకార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది.
దీపావళి కానుకగా అయలాన్ సినిమా(Ayalan Movie) ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీలో శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్, బాల శరవణన్ వంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మడొన్నే అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న మావీరన్ మూవీలో కూడా శివకార్తికేయన్(Hero Sivakarthikeyan) నటిస్తున్నాడు. తెలుగులో ఈ మూవీ మహావీరుడు టైటిల్‌తో విడుదల కానుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తోంది.