»How Is The Rx 100 Hero Karthikeya Bhaje Vayu Vegam Teaser
Bhaje Vayu Vegam: RX 100 హీరో ‘భజే వాయు వేగం’ టీజర్ ఎలా ఉంది?
ఆర్ ఎక్స్ 100 సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. అక్కడి నుంచి వరుస సినిమాలు చేస్తు వస్తున్నాడు కార్తికేయ. కానీ సరైన విజయాలు అందుకోలేకపోయాడు. అయితే.. బెదురు లంక సినిమాతో పర్వాలేదనిపించాడు. ఇక ఇప్పుడు 'భజే వాయు వేగం' అంటు వస్తున్నాడు.
How is the RX 100 Hero Karthikeya 'Bhaje Vayu Vegam' Teaser?
Bhaje Vayu Vegam: ఆర్ ఎక్స్ 100 మూవీ ఎంత సెన్సేషన్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా అజయ్ భూపతి, హీరోగా కార్తికేయ, హీరోయిన్గా పాయల్ రాజ్ పుత్ ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. యూత్‌కి ఆ సినిమా తెగ కనెక్ట్ అయిపోయింది. కానీ ఆ తరువాత ఈ ముగ్గురు చేసిన సినిమాలు ఏ మాత్రం ఆకట్టులేకపోయాయి. ముఖ్యంగా హీరో కార్తికేయకు ఎన్ని సినిమాలు చేసినా.. ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ పడడం లేదు. ఆ మధ్యలో అజిత్ సినిమాలో విలన్‌గా కూడా నటించాడు. కానీ సక్సెస్ కాలేకపోయాడు. అయితే.. చివరగా వచ్చిన ‘బెదురులంక 2012’ సినిమాతో పర్లేదనిపించుకున్నాడు. ఈ సినమాతో ఓ మోస్తరు విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు ‘భజే వాయు వేగం’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు.
ఈ సినిమాతో ప్రశాంత్ రెడ్డి ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ రూపొందిస్తుండగా.. ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ సినిమా పై మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉంది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న హీరో జీవితం ఎలాంటి మలుపు తీసుకుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే.. మెయిన్ కాన్సెప్ట్ మాత్రం తండ్రీ కొడుకుల ఎమోషన్స్ అన్నట్టుగా చూపించారు ‘ప్రతి ఒక్కరి జీవితంలో ఒకడుంటాడు. వాడి కోసం మనం ఏం చేయడానికైనా వెనకాడం. అది నా లైఫ్ లో మా నాన్న’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ బాగుంది. మరి ఈ సినిమాతో కార్తికేయ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.