»Harihara Veeramallu New Director For Harihara Veeramallu Differences Of Opinion Between Krish And Pawan
Harihara Veeramallu: ‘హరిహర వీరమల్లు’కి కొత్త డైరెక్టర్.. క్రిష్, పవన్ మధ్య అభిప్రాయభేదాలు?
ఎట్టకేలకు చాలా రోజులకు హరిహర వీరమల్లు అప్డేట్ ఇవ్వడంతో.. పండగ చేసుకుంటున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అయితే.. ఈ సినిమా దర్శకుడు మార్పు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి క్రిష్, పవన్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయా?
New director for 'Harihara Veeramallu'.. Differences between Krish and Pawan?
Harihara Veeramallu: పవర్ స్టార్ పొలిటికల్ హీట్‌లో.. లేటెస్ట్గా ‘హరిహర వీరమల్లు’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ పవన్ ఫ్యాన్స్‌కు మంచి జోష్ ఇచ్చిందనే చెప్పాలి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హరిహరవీరమల్లు టీజర్ ట్రెండింగ్ అవుతోంది. పవన్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అయితే.. ఇక్కడి వరకు అంతాబాగానే ఉన్నప్పటికీ.. ఈ టీజర్‌తో ఊహించిన ట్విస్ట్ ఇచ్చారు మేకర్స్. గత కొన్నాళ్లుగా ఈ సినిమా నుంచి దర్శకుడు క్రిష్ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తాజాగా.. టీజర్‌తో ఈ వార్తలు నిజమేనని క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. టీజర్‌తో పాటుగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్లో డైరెక్టర్లుగా క్రిష్‌తో పాటు ఏఎమ్ జ్యోతికృష్ణ పేర్లు కనిపించాయి. అంటే.. ఇక నుంచి ఈ సినిమాను జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయబోతున్నాడన్న మాట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం వరకు పూర్తయినట్లు సమాచారం. మిగిలిన షూటింగ్ పార్ట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జ్యోతికృష్ణ పూర్తి చేయబోతున్నాడు. అయితే.. క్రిష్ పర్యవేక్షణలోనే జ్యోతికృష్ణ ఈ సినిమాను పూర్తిచేస్తాడని చెప్పుకొచ్చారు మేకర్స్.
కానీ.. పవన్, క్రిష్‌కు మధ్య అభిప్రాయభేదాలు వచ్చిన కారణంగానే దర్శకుడి మార్పు జరిగిందనే ప్రచారం జరుగుతోంది. అందుకే.. క్రిష్, అనుష్కతో సినిమా స్టార్ట్ చేశాడని అంటున్నారు. ఇక హరిహరవీరమల్లు ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం తనయుడే జ్యోతికృష్ణ. గతంలో ఈయన నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్, రూల్స్ రంజన్ వంటి సినిమాలను తెరకెక్కించాడు. కానీ ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో.. పవర్ స్టార్‌ను జ్యోతి కృష్ణ హ్యాండిల్ చేస్తాడా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి క్రిష్ ఈ విషయంపై క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.