ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనే పవన్‌ను అసెంబ్లీకి పంపించాలని గట్టిగా ప్రచారం చేస్తోంది మెగా ఫ్యామిలీ. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా రంగంలోకి దిగిపోయాడు. మరి ఇప్పటికైనా పవన్ ఫ్యాన్స్ హ్యాపీనా?
Allu Arjun's 'Janasena' campaign.. Are Pawan fans happy?
Allu Arjun: చెప్పను బ్రదర్.. ఈ మాట అనగానే వెంటనే అల్లు అర్జున్ గుర్తొస్తాడు. అప్పట్లో బన్నీ చేసిన ఈ కామెంట్స్ పై పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. మెగా హీరోలకు సంబంధించిన ఏ సినీ ఫంక్షన్ జరిగినా సరే.. పవన్ ఫ్యాన్స్ ‘పవర్ స్టార్.. పవర్ స్టార్’ అని అరవడం చూస్తునే ఉంటాం. సరైనోడు సక్సెస్ మీట్లోను అదే జరిగింది. స్పీచ్ మధ్యలో పవన్ స్టార్ గురించి చెప్పాలని కొందరు ఫ్యాన్స్ గోల చేయడంతో.. ‘నేను చెప్పను బ్రదర్’ అని అన్నాడు బన్నీ.
ఇక్కడి నుంచి బన్నీ కాస్త పవన్ ఫ్యాన్స్‌కు ఎనిమీగా మారిపోయాడు. కానీ మెగా హీరోల మధ్య ఎలాంటి విభేధాలు లేవని చెబుతునే ఉన్నారు. అయినా కూడా అభిమానుల వాదనలు మాత్రం తగ్గలేదు. కానీ ఇప్పుడు బన్నీ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. లేటెస్ట్గా పుష్ప2 నుంచి పుష్ప.. పుష్ప.. అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ ఒక్క పాటతో పుష్పరాజ్ రూలింగ్ ఎలా ఉండబోతుంది.. అనేది చూపించాడు సుకుమార్. బన్నీతనదైన మార్క్ డాన్స్‌తో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఈ సాంగ్‌లో మూడు స్టెప్స్‌ని హైలెట్ చేశారు. షూ డ్రాప్ స్టెప్, ఫోన్ స్టెప్, ఛాయ్ స్టెప్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
మరీ ముఖ్యంగా ఛాయ్ స్టెప్‌లో గాజు గ్లాస్ పట్టుకొని స్టెప్పులేశాడు బన్నీ. ఇక పవన్ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ అనే సంగతి తెలిసిందే. దీంతో.. పవన్ కోసమే బన్నీ గాజు గ్లాసు పట్టుకొని స్టెప్పులేసి.. జనసేన తరపున ఇండైరెక్ట్‌గా ప్రచారం చేశాడని అంటున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం జనసేన కోసం రంగంలోకి దిగింది. ఇప్పుడు బన్నీ తనవంతు ప్రయత్నంగా.. పుష్ప2 సినిమాతో ఇలా ప్రచారం చేశాడని.. పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాబట్టి.. ఇక్కడి నుంచి మెగా ఫ్యాన్స్ మధ్య చెప్పను బ్రదర్ అనే డైలాగ్ వచ్చే ఛాన్స్ తక్కువనే చెప్పాలి.