వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) మరోసారి వార్తల్లో నిలిచారు. ఏదైనా సరే ముక్కుసూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే ఆర్జీవీ(RGV) రేపు ‘నిజం’ అనే యూట్యూబ్ ఛానెల్(Nijam Youtube Channel) ప్రారంభించనున్నట్లు ప్రకటించాడు. సామాజిక అంశాలు, సమకాలీన పరిస్థితుల మీద తన గళాన్ని వినిపించేందుకు వర్మ నిజం యూట్యూబ్ ఛానెల్ ప్రారంభిస్తున్నానని తెలిపారు.
రాంగోపాల్ వర్మ చేసిన ట్వీట్:
నిజం నివురు కప్పిన నిప్పు లాంటిది.. ఎప్పుడో అప్పుడు మంటగా మారి అబద్దాన్ని కాలుస్తుంది.. నిజం” చానల్ 1st ఎపిసోడ్ “వివేకా హత్య వెనక నిజం లో అబద్దముందా ? 25th 4 pm https://t.co/O5T2WUf0lg ఇదిగో నా “నిజం“ చానల్ లోగో #RGVNijampic.twitter.com/nunuERSVsR
ట్విట్టర్(Twitter) వేదికగా తాను నిజం యూట్యూబ్ ఛానెల్ (Nijam Youtube Channel) ప్రారంభిస్తున్నట్లు వర్మ(Ram Gopal Varma) తెలిపారు. నిజం ఛానెల్లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు. సైన్స్, హిస్టరీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇలా మరెన్నో టాపిక్స్ గురించి చెబుతానని వర్మ వెల్లడించాడు.
వివేకా మర్డర్ వెనక నిజం లోని అబద్ధాలు,ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు,ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక నిజాలన్నింటినీ తవ్వి తీయడమే "నిజం" ఛానల్ ముఖ్య ఉద్దేశం. pic.twitter.com/ewEnLDZjC1
ఏప్రిల్ 25వ తేది సాయంత్రం 4 గంటలకు నిజం యూట్యూబ్ చానెల్(Nijam Youtube Channel)ను లాంచ్ చేయనున్నట్లు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) ట్వీట్ చేశాడు. అబద్దం బతికేది నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికని, నిజాన్ని ఎవ్వరూ చంపలేరని, నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్లు నటిస్తుందని వర్మ ట్వీట్ లో రాసుకొచ్చాడు. తను ప్రారంభించబోయే ఛానెల్ గురించి చెబుతూ, ఎలా ఉండబోతుందో తెలియజేశాడు. రానున్న రోజుల్లో రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma) ఎలాంటి నిజనిజాలను బయటకు తీసుకొస్తాడోనని అందరూ ఎదురుచూస్తున్నారు.
నేను ప్రారంభించబోయే”నిజం" YouTube ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారెస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది…నిజం చానల్ లాంచ్ 25th 4 pm https://t.co/O5T2WUf0lg#RGVNijampic.twitter.com/KrLHuZAvS7