Jaane Jaan Movie Explanation: వైట్ షర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి బ్యాక్ షాట్ నుంచి కెమెరా స్లోగా ఫార్వడ్ అవుతుంది. ఆయన ముందు ప్రాజెక్ట్ పేపర్స్ చిందరవందరగా పడి ఉంటాయి. వాటినే చూస్తూ ఆ పర్సన్ అలా పైకి చూస్తాడు.. అతను టీచర్ నరేన్. తాను ఉరిపోసుకుంటాడు. తాడును మెడకు పెట్టుకొని టైట్ చేసుకుంటాడు. అంతలో డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఆత్రంతో కుర్చిని తన్నుతాడు.. ఉరి బిగుస్తుంది. కట్ చేస్తే నరేన్ కల కన్నట్లు బెడ్ పైన పడుకొని ఉంటాడు. బైట నుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అక్కడి నుంచి వచ్చి డోర్ సందులోంచి బయటకు చూస్తాడు. స్కూల్ కు రెడీ అయిన తారా బయట నిల్చొని వాల్ల అమ్మాను పిలుస్తుంది. స్కూల్ కు లేట్ అవుతుంది అని త్వరగా రమ్మంటుంది. ఇంట్లో తారా తల్లి మాయా డిసౌజా ఆఫీస్ కు రెడీ అవుతుంది. ఇంట్లో స్విచ్లు ఆఫ్ చేస్తుంది. బాత్రుమ్ బాకెట్లో హీటర్ అలానే పెట్టావు అని, మాయా దాన్ని తీస్తూ ఒక్క పనికూడా సరిగ్గా చేయవు అని అంటుంది. తరువాత ఇంటిలో ఒక చెక్క కొద్దిగా ఊడిపోతుంది. దాన్ని సరిచేసి తన జాకెట్, బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్తుంది. వాళ్లను నరేన్ చూస్తూ ఉంటాడు. వారు ఇద్దరు సంతోషంగా వెళ్లడం చూసిన నరేన్ కూడా ఆనందపడుతాడు. ఇక అలానే స్మైల్ చేస్తూ.. చెస్ ఆడుతాడు. ఆగిపోయిన వాచ్ ని సరి చేసి, వాటర్ హీట్ చేసుకొని అద్దంలో చూసుకుంటూ.. మాయను ఎలా పలకరించాలో ప్రాక్టీస్ చేస్తుంటాడు.
చదవండి:Jigar Thanda Double X Review: జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీ రివ్యూ
తరువాత సీన్లో మాయ తన కేఫేకు వెళ్తుంది. నరేన్ రెడీ అయ్యి చేతులో బ్యాగ్ పట్టుకొని స్కూల్ కు వెళ్తుంటాడు. దారిలో అందరూ అతనికి రెస్పెక్ట్ ఇస్తూ గుడ్ మార్నింగ్ చెప్తుంటారు. తన బ్యాగ్రౌండ్లో మాయతో ఎలా మాట్లాడలో మైండ్ వాయిస్ వస్తూ ఉంటుంది. రెస్టారెంట్ లో మాయ ఫుడ్ పార్సల్ కడుతూ ఉండగా అక్కడికి టీచర్ వస్తున్నాడని తన అసిస్టెంట్ చెప్తుంది. అయితే ఏంటి అని మాయ అడుగుతుంది. అతను రోజు నీకోసమే మన రెస్టారెంట్ కు వస్తుంటారు అని చెప్తుంది. నిన్న నువ్వు రాలేదు, టీచర్ కూడా రాలేదు అని మరో వ్యక్తి చెప్తాడు. అంతలో అక్కడికి టీచర్ వస్తాడు. మాయ విష్ చేస్తుంది. తాను మొహమాట పడుతూ మాట్లాడుతారు. కట్ చేస్తే డోర్ కొట్టిన సౌండ్ వస్తుంది. డోర్ ఓపెన్ చేస్తే మాయ బయట ఉంటుంది. నేను మీ పక్క ప్లాట్ లో ఇప్పుడే వచ్చామని, ప్లంబర్ అవసరం ఉందని చెప్పడంతో అతను లోపలికి వెళ్తాడు. ఆ డోర్ నుంచి మాయ ఇళ్లును చూస్తుంది. డంబెల్స్ పేపర్స్ కనిపిస్తాయి. తరువాత అతను నెంబర్ ఇవ్వగానే మాయ వెళ్లిపోతుంది. నరేన్ అలానే చూస్తూ నిలుచుంటాడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది. మళ్లీ రెస్టారెంట్ సీన్లో నరేన్ ఎదో చెప్తుండగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అని మాయ అంటుంది. అవును అంటాడు టీచర్. అది తీసుకురావడానికి మాయ వెళ్లి డోర్ వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది. పార్సల్ తీసుకొని నరేన్ వెళ్లుండగా అక్కడికి అజిత్ మాత్రే పోగతాగుకుంటూ లోపలికి వస్తాడు. మాయ కాస్త భయపడుతూ చూస్తుంది. అజిత్ వచ్చి రెస్టారెంట్ లో కూర్చొంటాడు. అది నరేన్ చూసుకుంటూ స్కూల్ కు వెళ్తాడు.
కుర్చీలో కూర్చున్న అజిత్ దగ్గరకు మాయ వచ్చి ఎందుకు వచ్చావు.. ఇక్కడి నుంచి వెల్లిపో.. అసలు నన్నెలా కనిపెట్టావు అని అంటుంది. సరిగ్గా వెతికితే ఆ దేవుడే దొరుకుతాడు.. నా పెళ్లానివి నువ్వు దొరకవా అని అజిత్ అంటాడు. మన మధ్యలో ఏం లేదు ఇక్కడ నుంచి వెళ్లిపో అంటుంది. దానికి చాలా ఉన్నాయి అని సరిగ్గా లెక్కపెడితే 15 లక్షల వరకు ఉంటాయి అని చెప్తాడు. పేరు, బిజినెస్ అన్ని మార్చుకున్నావా అని అంటుండగా… నీతో ఇక్కడ మాట్లడలేనని ఒక అడ్రెస్ రాసిచ్చి మధ్యాహ్నం 2 గంటలకు రమ్మని చెప్తుంది. దాన్ని తీసుకొని అజిత్ వెళ్లిపోతాడు. తరువాత మాయ టెన్షన్ పడుతుంది. నరేన్ స్కూల్ కు వెళ్తుంటాడు. అంతలో దీపక్ అనే స్టూడెంట్ సర్ అని పిలుస్తాడు. తరువాత దీపక్ తో కాయిన్ గేమ్ ఆడుతాడు. అరచేతులో పెట్టుకున్న కాయిన్ పై టీచర్ చేయి పెడుతాడు కౌంట్ చేసి నేనే గెలిచా అని దీపక్ అనుకుంటూ చేయి చూస్తే కాయిన్ ఉండదు. దాంతో ఎలా అని అడగ్గా.. నువ్వు కాయిన్ పైన ఫోకస్ పెట్టు, నన్ను ఓడించడం పైన కాదు అని కాయిన్ దీపక్ ఇచ్చి వెళ్లిపోతాడు టీచర్ నరేన్.
తరువాత సీన్లో కరణ్ తన ఫ్రెండ్ తో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా అతన్ని ఒక ఆఫీసర్ పిలుస్తాడు. అదే సమయంలో కరణ్ కిక్ తగిలి కింద పడుతాడు. ఏంటి అనడగా కమిషనర్ పిలుస్తున్నారు త్వరగా వెళ్లాలి అంటాడు. దాంతో రింగ్ లో ఉన్న కరణ్ ఫ్రెండ్ నీ టైమ్ బాగుంది, లేదంటే నా చేతిలో అయిపోయేవాడివే అని రెచ్చ గొడుతాడు. కరణ్ ఒక్క నిమిషం టైమ్ అడిగి మళ్లీ ఫైట్ చేస్తాడు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. మధ్యలో టైమ్ అడుగుతాడు.. కరణ్ కింద పడుతాడు. తారువాత అతనికి గట్టి పంచ్ ఇస్తాడు. టైమ్ 2 సెకన్ల లోపే కరణ్ ఫ్రెండ్ ను పడగొట్టి, చేయి ఇచ్చి లేపి వెళ్లిపోతాడు. కమిషనర్ అజిత్ ఫైల్ ఇచ్చి అతన్ని పట్టుకొమ్మని చెప్తాడు.
మరో సీన్లో అజిత్ కోపంగా వచ్చి మాయను కొట్టినట్లు కలగంటుంది. తరువాత టెన్షన్ పడుతుంది. టైమ్ చూస్తుంది. అజిత్ ఓ అమ్మాయితో పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తాడు. కట్ చేస్తే అదే మ్యాచింగ్ సీన్లో అక్కడికి కరణ్ వస్తాడు. అజిత్ ఫోటో చూపించి అడుగుతాడు. అక్కడున్న లేడి ఫోటో మీద ఉమ్మివేస్తుంది. తరువాత అజిత్ గురించి అడుగుతాడు. అజిత్ కాలింగ్ పాంగ్ లో ఉన్నట్లు చెప్తుంది.
నెక్ట్స్ సీన్లో మాయ అజిత్ తో ఒక హోటల్ లో కూర్చొని మాట్లాడుతుంది. అజిత్ తన పోలీసు జాబ్, తన ఓల్డ్ బిజినెస్ వదిలేస్తున్నట్లు చెప్తాడు. నీకేం కావాలి అని మాయ అడుగుతుంది. మనం మళ్లీ కుటుంబంలా కలిసి ఉందామని, తన బిడ్డ చాలా బాగుందని చెప్తాడు. అసలు తారా గురించి నీకెలా తెలుసు అని అడుగుతుంది. తాను తారా గురించి, మాయ గురించి ఏదో మాట్లాడుతుండగానే మయా అక్కడి నుంచి హడావిడీగా వెళ్లిపోతుంది. నేరుగా తారా స్కూల్ వెళ్లి తనను తీసుకొని ఇంటి వెళ్తుంది. మరో సీన్లో స్కూల్ నుంచి నరేన్ బయటకు వచ్చి తన డోజో ప్రాక్టీస్ చేసే ప్లేస్ కు వెళ్తాడు. అక్కడ తను ప్రాక్టీస్ చేస్తుంటాడు.
తరువాత సీన్లో మాయ వంట చేస్తుంటే తారా వచ్చి ఏదో అడుగుతుంది. ఇక తన టెన్నీస్ ఫీజ్ గురించి అడిగి అది నోట్ చేసుకుంటుంది. అంతలో డోర్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరు అంటే నేను అజిత్ ను అని చెప్తాడు. తారా బయటకు వస్తే లోపలికి వెళ్లు అని అంటుంది. సోనియా డోర్ తీయి అని బయటే ఉండి మాట్లాడుతుంటాడు. తాను పోలీసులకు ఫోన్ చేస్తా అని అంటే చేయమంటాడు. మాయ ఆలోచనలో పడుతుంది. కేవలం మాట్లాడి వెళ్లిపోతానని అంటాడు.. మాయ డోర్ తీస్తుంది. అతను లోపలికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు. తన దగ్గర డబ్బులు లేవని అంటుండగా తారా హీటర్ పనిచేయడం లేదని బయటకు వస్తుంది. దాంతో మాయ గట్టిగా అరుస్తూ లోపలికి వెళ్లు అంటుంది. తాను వెళ్లిపోగానే డబ్బులు తీసుకురావడానికి లోపలికి వెళ్లి తారాకు సారీ చెప్తుంది. తరువాత డబ్బులు తనకు ఇచ్చి వెళ్లిపో అంటుంది. తన దగ్గర ఇంత కన్న ఎక్కువ ఏమి లేవని చెప్తుంది. దాంతో తారా ఉంది కదా అని.. తననను కూడా పోల్ డ్యాన్స్ చేయిస్తే డబ్బులే డబ్బులు అంటూ మాట్లాడుతాడు. వెళ్లిపో అని డోర్ తీస్తుంది. అజిత్ కోపంతో మాయ ముఖాన్ని పట్టుకొని ఇది నా ఇల్లు.. తాను నా కూతురు, ఎప్పుడైనా వస్తా.. ఏదైనా చేస్తా అని అంటాడు. తాను మళ్లీ రాకు అని, కావాలంటే ప్రతి నెల డబ్బులు పంపిస్తా అంటుంది. దాంతో తారాను నేను తీసుకెళ్లిపోతా అని మాట్లాడుతుండగా.. తారా హీటర్ తో అజిత్ తలమీద కొడుతుంది. తనకు బ్లెడ్ వస్తుంది. దాంతో తారాను కొడుతాడు. మాయ ఎటాక్ చెస్తుంది. హీటర్ వైర్ తో అతని మెడకు బిగించి గట్టిగా పట్టుకుంటుంది. తారా చేతులు పట్టుకుంటుంది. ఇక్క సారిగా నిశబ్దం.. అజిత్ చనిపోయాడు అని తారా అంటుంది. మాయ బాధపడుకుంటు అజిత్ లేపడానికి ట్రై చేస్తుంది. కాని అతను అప్పటికే చనిపోయి ఉంటాడు.
నెక్ట్స్ సీన్లో నరేన్ తన ప్రాక్టీస్ ముగించుకొని వస్తుంటాడు. ఇంట్లో తారా, మాయ ఇద్దరు అజిత్ బాడీ పక్కనే కూర్చొని ఆలోచిస్తారు. తరువాత మాయ బయటకు వచ్చి చూస్తుంది. లోపలికి వెళ్లి తనను ఒక దుప్పటిలో కప్పెట్టి.. డోర్ తీయగానే నరేన్ ను చూసి భయపడుతుంది. ఇంట్లో కాంక్రోచ్ ను చంపానని దాన్ని బయట వేయడానికి వచ్చానని చెప్పి లోపలికి వెళ్తుంది. అజిత్ బాడీని లాగితే అది కదలదు… దాంతో పోలీసులకు ఫోన్ చేయాలని కూతురుతో అంటుంది. దానికి.. ముందు నేనే కదా తనను కొట్టాను అని తారా అంటుంది. ఇంకెప్పుడు అలా మాట్లాడకు అని కూతురుతో మాయ చెప్తుంది. ఇద్దరు ఏడ్చుకుంటు ఒకరిని ఒకరు ఓదారుస్తూ ఉండగా.. డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. ఎవరు అని మాయ అడుగుతుంది. నరేన్ అని చెప్తాడు. ఈ టైమ్ ఏంటి.. రేపు మాట్లాడుకుందామా అని అంటుంది. దానికి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారో తెలుసుకోవచ్చా అని అంటాడు. చనిపోయిన మనిషిని దాచడం అంత సులభం కాదు, ఆ పని మీరు ఒంటరిగా చేయలేరు అని అంటాడు. దాంతో మాయ డోర్ తీస్తుంది. అతను వచ్చి బాడీని చూస్తాడు. ఈ విషయం మీకెలా తెలుసు అని అడుగుతుంది. దానికి మ్యాక్స్ లో ఏదో ప్రిన్స్ పుల్ చెప్పి… హోటల్ కు ఒక అపరిచితుడు వచ్చినప్పుడు మీలో కనిపించిన భయం, ఇంత ముందుకు మీరు డోర్ తీసినప్పుడు కనిపించింది అని, మీరు చెప్పిన కాంక్రోచ్ అదే మనిషి బాడీ అని చెప్తాడు. అతనే ఇతను అని ఎలా కనిపెట్టారు అని అడుగుతుంది. ఇంటిముందు కాల్చిన సిగరేట్ పీక, పోగ, ఇంకా తలపు సందులోంచి చుట్టిన బాడీ అని చెప్తాడు. ఇక అజిత్ తన మాజీ భర్త అని తారాను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే నేనే చంపాను అని చెప్తుంది. అంతలో అక్కడికి తారా వస్తుంది. తాను ఏదో మాట్లాడబోతుంటే మాయ అడ్డు పడుతుంది. నిజం దాచడం అంత తేలిక కాదు అని.. అజిత్ మెడా, చెతులను చూస్తూ పోలీసులు కనిపెడుతారు అని నరేన్ చెప్తాడు. దాంతో మాయ ఆలోచనలో పడుతుంది. తారా ఏం చేయమంటారు అని అడిగుతుంది. అలా కాదు అని మాయ అంటుండగా, టీచర్ ను హెల్ప్ చేయనివ్వు అని తారా అంటుంది. దానికి ఇలా చేస్తే మీరు కూడా ఈ కేసులో ఇరుక్కుంటారు అని మాయ అంటుంది. పోలీసుల దగ్గర నిజం దాచడం కూడా నేరమే అని, నేను అల్రెడీ ఇరుకున్నానని నరేన్ చెప్తాడు. దాంతో తారా, మాయ ఇద్దరు ఆక్సెప్ట్ చేస్తారు. నరేన్ బాడీని తన భుజం మీద వేసుకొని తన రూమ్ లోకి వెళ్లి తన ప్యాకెట్లో ఉన్న వాటిని తీసుకుంటాడు. తన ఐడీని తీసుకుంటాడు. ఇతన్ని వెతుకుంటు ఎవరన్నా ఇక్కడికి వస్తే మీరు దొరికిపోతారు. అని బోర్డు మీద ఏదో ఫార్ములా వేస్తాడు. తరువాత అతని బట్టలు తీసేస్తుంటాడు. మీరు బయటపడాలి అంటే కొన్ని ఎవిడెన్స్ లను సేకరించాలి అని మాయతో చెప్తాడు. మాయ థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోతుంది.
తరువాత సీన్లో మాయ ఇంట్లో నిలబడి రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తుంది. తరువాత రెస్టారెంట్ లో నరేన్ ఎగ్ నూడిల్స్ కోసం లైన్లో నిలబడి ఉంటాడు. కట్ చేస్తే ట్రైన్ వస్తుంది. అందులో కరణ్ వస్తాడు. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి సుందర్ స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్తారు. అజిత్ గురించి అక్కడి పోలీసులకు చెప్తాడు. కాలింగ్ పాంగ్ పెద్దది ఏం కాదు దొరుకుతాడు అని ఆఫీసర్ చెప్తాడు. తరువాత సీన్లో నరేన్ ఇంటికి రాగనే టీచర్ అని పిలుస్తుంది మాయ. తనకు భయం వేస్తుందని చెప్తుంది. భయం ఎందుకు నేను చెప్పినట్లు చేశారు కదా అని గుడై నైట్ చెప్పి తన రూమ్ కి వెళ్లిపోతాడు.
నెక్ట్స్ సీన్లో అజిత్ ఫోటోను చూపిస్తూ సుందర్ వెతుకుతూ ఉంటాడు. కరణ్ ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ.. అజిత్ కు లాస్ట్ కాల్ ఈ టవర్ నుంచే వచ్చింది అని చెప్తాడు. ఇద్దరు కలిసి మాయ కేఫేకు వెళ్లి కాఫీ అడిగుతాడు, తరువాత కేకులు ఆర్డర్ చేస్తాడు. అజత్ ఫోటోను చూపించి ఇతన్ని ఇక్కడ చూశారా అని అడుగుతాడు. మాయ లేదు అని చెప్తుంది. మాయకు డౌట్ వస్తుంది. అక్కడికి నరేన్ వస్తాడు. మాయకు ఎగ్ ఫ్రైడ్ రైజ్ చెప్తుండగా అక్కడికి కరణ్ వచ్చి నరేన్ తో మాట్లాడుతాడు. వారిద్దరు ఫ్రెండ్స్. కరణ్ కు అర్జెంట్ కాల్ వచ్చి నరేన్ తరువాత కలుస్తా అని చెప్పి వెళ్లిపోతాడు. నరేన్ పార్సల్ తీసుకొని వెళ్తుండగా మాయ పిలిచి అతనితో మాట్లాడుతుంది. అజిత్ గురించి అతను అడిగాడు అని చెప్తుంది. నేను చెప్పింది చేశారు కదా ఇలా పబ్లిక్ గా మాట్లాడడంం మంచిది కాదని చెప్పి వెళ్లిపోతాడు.
తరువాత సీన్లో కరణ్, సుందర్ ఇద్దరు ఒక ప్లేస్ లో వెతుకుతుంటే సుందర్ కు ఫోన్ వచ్చి అతను ఉన్న హోటల్ తెలిసింది అని అక్కడికి వెళ్తారు. హోటల్ లో తన రూమ్ వెళ్లి చూస్తారు. అతను వచ్చిన రోజు ఒక స్కూల్ గురించి అడిగినట్లు హోటల్ వర్కర్ చెప్తాడు. దాంతో వారిద్దరు స్కూల్ కు వెళ్తారు. అక్కడ స్కూల్ దగ్గర చూస్తుంటారు. ఈ స్కూల్ కి అజిత్ ఏందో సంబంధం ఉన్నట్లు వారు అనుమానపడుతారు. అంతలో అక్కడ మయా, తారా ఇద్దరు మాట్లాడుకుంటారు. అది చూసి కరణ్ కు డౌట్ వస్తుంది. తరువాత కరణ్ మాయ ఇంటికి వచ్చి అజిత్ పూర్తి డిటైల్స్ ను పంపించండి అని ఫోన్లో మాట్లాడుతుంటే.. అది నరేన్ చూస్తాడు. మాయను అడుగుదామని డోర్ కొట్టాడానికి వెళ్తాడు.. కాని డోర్ కొట్టకుండ వెనక్కి వెళ్లిపోతాడు. తరువాత డ్రెస్ ఛేంజ్ చేసుకొని బయటకు వచ్చి మాయకు ఫోన్ చేస్తాడు. కరణ్ వల్ల ప్రాబ్లమ్ రావచ్చు అని చెప్తాడు. కాలింగ్ పాంగ్ లో మీరే ఏకైక సస్పెక్ట్ అని నేను చెప్పినట్లు చెప్పండి అని చెప్తాడు. మీకు సంబంధించినంత వరకు అజిత్ ఇంకా బతికే ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఆ బాడీ ఎక్కడ అని అడుగుతుంది మాయ. ఆ బాడీ ఎప్పటికి దొరకదు అని చెప్తాడు. కట్ చేస్తే.. బాడీ దొరికిందని కరణ్, సుందర్ ఇద్దరు వెళ్తుంటారు. అక్కడే అతని పోలీస్ ఐడీ దొరికిందని చెప్తాడు. ఇద్దరు కలిసి అక్కడికి వెళ్తారు. అక్కడ కాలి ఉన్న శవం కనిపిస్తుంది. సీరియస్ కేసే అనుకుంటూ తన ఐడీని చూస్తాడు. శవం దొరికిన ప్రాంతంలో బ్లెడ్ శాంపిల్ దొరుకుతుంది. దాన్ని దేనితో కంపేయిర్ చేస్తారు అని సుందర్ అడుగుతాడు. దాంతో హోటల్ కు వెళ్లి కోంబ్ లోని తన హెయిర్ ను కలెక్ట్ చేస్తారు. దాన్ని ల్యాబ్ లో టెస్ట్ చేసిన డాక్టర్ ఈ బాడీ వందశాతం అజిత్ మాత్రేదే అని చెప్తాడు. అదే సమయంలో కరణ్ కు ఫోన్ వస్తుంది.
కట్ చేస్తే మాయ ఇంట్లో ఉండగా డోర్ సౌండ్ వినిపిస్తుంది. ఎవరు అంటే కరణ్ అని చెప్తాడు. మాయాకు ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే నరేన్ కు ఫోన్ చేస్తుంది. నరేన్ డోజో క్లాస్ లో ఉంటారు. డోర్ తీస్తుంది. కరణ్ పరిచయం చేసుకొని అజిత్ ఫోటో చూపించి ఇతన్ని గుర్తుపట్టారా అని అడుగుతాడు. దానికి తను తన మాజీ హస్బెండ్ అని చెప్తుంది. తన కూతురు తాను అతని నుంచి దూరం ఉండాలి అనుకున్నట్లు అందుకే ఆ రోజు గుర్తుపట్టలేదు అన్నాని చెప్తుంది. అతనికి కేవలం డబ్బు పిచ్చి అని మళ్లీ ఇప్పుడు ఏం చేశాడు అని అడుగుతుంది. మీరు పోలీసు స్టేషన్ కు రావాలని ఒక బాడీ దొరికిందని చెప్తాడు. దానికి తాను డ్రెస్ మార్చుకొని వస్తా అని వెళ్తుంది. తరువాత తనను స్టేషన్ కు తీసుకెళ్లి కొన్ని వస్తువలును చూపించి గుర్తుపట్టగలరా అని అడుగుతాడు. లేదని చెప్తుంది. తరువాత అజిత్ గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. తనను మొదటి సారిగా ఎప్పుడు కలిశారు అని ప్యారడైజ్ లో ఉన్న తన ఫోటోను చూపించి అడుగుతాడు. అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు వాడు మాత్రం తనను ప్యారడైజ్ లో అమ్మెసినట్లు చెప్తుంది. తరువాత 10 వ తేదీన ఎక్కడికి వెళ్లారు అని అడుగుతాడు. దానికి ఆమె సినిమాకు వెళ్లారని, అటునుంచి డిన్నర్ కు వెళ్లారు అని చెప్తుంది. అది విని కరణ్ కు డౌట్ వస్తుంది. అంతలో అక్కడికి నరేన్ వస్తాడు. తనతో మాయా గురించి మాట్లాడుతాడు. అతనికి అజిత్ ఫోటో చూపించి చూశావా అని అడుగుతాడు. లేదు అని చెప్తాడు. దాంతో వాళ్లిద్దరి కాలేజీ గురించి మాట్లాడుకుంటారు. తరువాత అజిత్ ను ఎవరో చంపేశారు అని అతని గురించే వెతుకుతున్నట్లు కరణ్ చెప్తాడు. ఇద్దరు కొద్ది సేపు మాట్లాడి.. మీ పక్కింటి ఆవిడ సాలిడ్ హాట్ గురు అని చెప్పి వెళ్తాడు.
నెక్ట్స్ సీన్లో నరేన్ మాయ ఇద్దరు మాట్లాడుకుంటారు. తారాను ప్రిపేర్ చేశావా అని, సినిమా టికెట్లను కబోర్డ్ నుంచి తీసి జేబు ప్యాకెట్లో పెట్టండి అని మరిచి పోయినట్లుగా ఉండాలి అని చెప్తాడు. తరువాత కరణ్ తో మాట్లాడింది గుర్తుకు వచ్చి.. మీ కేఫేకు నేను వస్తున్నట్లు అందరికి తెలుసా అని అడిగి.. నేను చూసుకుంటా అని వెళ్లిపోతుండగా టీచర్ ను పిలిచి హగ్ చేసుకుంటుంది. దానికి నరేన్ సంతోషపడుతాడు. తరువాత సీన్లో తారా ఏడుస్తుంది. ఏం జరిగింది అని మాయ అడుగుతుంది. తారా సారీ చెప్పి తాను చేసింది తప్పు అని మాట్లాడుతుంది. నన్ను నీ నుంచి ఎవరు దూరం చేయలేరని, టీచర్ అన్ని చూసుకుంటాడు అని చెప్పాడు అంటుంది. వీరి మాటలను నరేన్ వింటుంటాడు.
తరువాత సీన్లో మాయను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని కమిషనర్ కరణ్ ను అడుగుతాడు. దానికి ఇంకా కొంచెం టైమ్ కావాలని చెప్తాడు. తనమీద అరిచి ఫోన్ పెట్టేస్తాడు. ఆ సమయంలో సినిమా టికెట్లు తీసుకొని సుందర్ వస్తాడు. అవి చూపించి తన పాయెంట్ జేబులోంచి తీసినట్లు చెప్తాడు. తరువాత తన ఫోటోను చూస్తూ తను కావాలనే ప్లాన్ చేసినట్లు చెప్తాడు. తరువాత తాను సినిమాకు వెళ్లినట్లు, అక్కడినుంచి వస్తున్న అజిత్ ను రాయి తీసుకొని కొట్టినట్లు, బట్టలను కాల్చినట్లు, ఆ మధ్యలో తనతో ముద్దుపెట్టుకోబోతున్నట్లు కల కంటాడు. ఇలా తాను అనలసీస్ చేసుకుంటాడు.
తరువాత సీన్లో నరేన్ కు మయా ఫోన్లో మాట్లాడుకుంటారు. సినిమా టికెట్లు అడిగితీసుకున్నట్లు చెప్తుంది. తరువాత తారాతో కరణ్ మాట్లాడాడు అంటే తనతో నరేన్ మాట్లాడుతాడు. 10 వ తారీఖు రోజ ఏం చేశారు అని అడిగారు. దానికి సినిమాకు వెళ్లినట్లు చెప్తుంది. ఇంకెమన్నా అడిగారా అంటే లేదు.. అని చెప్పి గుడ్ నైట్ చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తరువాత తనకు ఫ్రెండ్ మీనాకు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది.
నెక్ట్స్ సీన్లో నరేన్ కోసం కరణ్ వెయిట్ చేస్తుంటాడు. మీ ఇంట్లో తాగడానికి వేడివేడిగా ఏమన్నా ఉందా అని అడిగి నరేన్ తో ఇంట్లోకి వెళ్తాడు. కూర్చొ అని చెప్తాడు. తాను అన్ని చూసి ఎక్కడ కూర్చోవాలని అడిగి పాత బ్రూస్లీ పోస్టర్ చూస్తాడు. దాన్ని పట్టుకోబోతుంటే జాగ్రత్తా అని నరేన్ హెచ్చరిస్తాడు. కాఫీ తాగుతూ తన బుక్స్ గురించి అడుగుతాడు. ఒక ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయడానికి పది ఏళ్లు పట్టింది అని తీరా చూస్తే తన కన్న ముందే ఎవరో సాల్వ్ చేశారని చెప్తాడు. తరువాత చెస్ ను చూసి ఎవరితో ఆడుతావు అని, కత్తిలాంటి నైబర్ ను పెట్టుకొని ఒక్కడివే ఆడుతావా అని అంటాడు. తరువాత ఈ కేసులో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని అంటాడు.
నెక్ట్స్ సీన్లో మాయ బ్యాంక్ నుంచి బయటకు వస్తుంది. కరణ్ పిలుస్తాడు. తనను ఫాలో అవుతున్నావా అని అంటుంది. కొంచెం మాట్లాడాలి అని అడుగుతుండగా వారెంట్ ఉందా అని అడుగుతుంది. తరువాత కాసేపు మాట్లాడాలి అని కరణ్ అంటాడు.
నెక్ట్స్ సీన్లో నరేన్ హెయిర్ ట్రాన్స్ ప్లంటేషన్ గురించి నెట్ లో చూస్తుంటాడు. ఆలోచనలో పడుతాడు. అంతలో ప్రిన్స్ పల్ సర్ పిలుస్తున్నారు అని ప్యూన్ చెప్తాడు. తరువాత సీన్లో కరణ్, మాయ ఇద్దరు ఒక హోటల్ కూర్చొని మాట్లాడుకుంటారు. కరణ్ డ్రాగన్ మోమొస్ ఆర్డర్ చేస్తాడు. మాయ ఎక్కువ కారం ఉన్న మోమోస్ ను తీసుకురా అని నేపాలిలో చెప్తుంది. కరణ్ 10 తారీఖునా మీరు ఏం చేశారో మళ్లి ఒక్క సారి చెప్పమని అడుగుతాడు. మళ్లీనా అని విసుగు తెచ్చుకుంటుంది. నెక్ట్స్ సీన్లో టర్మ్ ఎగ్జామ్ కు మ్యాక్స్ పేపర్ ఈజీగా ప్రీపేర్ చేయండి అని ప్రిన్సిపల్ నరేన్ తో చెప్తాడు. ఎందుకు అంటే మీరు ఇచ్చే ప్రాబ్లమ్స్ చాలా కష్టంగా ఉన్నాయి అంటారు. పేపర్ తీసుకొనిన నరేన్ వెళ్లిపోతాడు. తరువాత ఆర్డర్ చేసిన మోమొస్ వస్తాయి వాటిని తింటూ కరణ్ ప్రశ్నలు అడుగుతుంటాడు. అవి చాలా కారంగా ఉంటాయి. దానితో అతను సరిగ్గా మాట్లాడలేడు. మాయ అక్కడినుంచి వెళ్లిపోతుంది. తరువాత సీన్లో దీపక్ ను పిలిచి మ్యాక్స్ పేపర్ హార్డ్ గా ఉందా అని అడుగుతాడు. దానికి దీపక్ చాలా హర్డ్ అని చెప్తాడు. నరేన్ వెళ్లిపోతాడు.
పోలీస్టేషన్లో సుందర్ తో కరణ్ మాట్లాడుతాడు. తారా ఫ్రెండ్ మీనాతో తాను మాట్లాడిన విషయం చెప్తాడు. పార్ట్ 1 చూడకుండా పార్ట్ 2 ఎలా చూస్తుంది అని మీనా చెప్తుంది. తరువాత తాను మోమొస్ తిని బాధ పడిని విషయాన్ని చెప్తాడు. దానికి సుందర్ అలాంటివి స్పెషల్ గా అడిగితే తప్ప ఇవ్వరు అని చెప్తాడు. మాయ కావాలనే అలా చేసింది అని కరణ్ భావిస్తాడు. నెక్ట్స్ సీన్లో అజిత్ బాడీని అనలసీస్ చేసిన డాక్టర్ హత్య గురించి ఎక్స్ ప్లెయిన్ చేస్తాడు. అతన్ని కాల్చాడానికి ముందే హీటర్ వైర్ లాంటి పరికరంతో అతని గొంతును గాయపరిచినట్లు, దానితోటే తల మీద కొట్టినట్లు చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో మాయా కేఫే బయట కరణ్ ఫోన్ మాట్లాడుతూ.. కనిపిస్తాడు. మరో సీన్లో దీపక్ టీచర్ తో కాయిన్ గేమ్ ఆడుతాడు. తరువాత సీన్లో కరణ్ లోపిలికి వచ్చి మాయతో మాట్లాడుతాడు. డ్రాగన్ మోమొస్ విషయంలో మాయ సారీ చెప్తుంది. తరువాత సీన్లో నరేన్ ఇంటికి వస్తుంటాడు. అప్పటికే కరణ్ తన కోసం ఇంటిపైన వెయిట్ చేస్తుంటాడు. ఇద్దరు మాట్లాడుకుంటారు. తన స్టూడెంట్స్ గురించి, మ్యాక్స్ గురించి కాసేపు మాట్లాడుకుంటారు. మనమే కొన్ని ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ వెతుకాలి అని మ్యాక్స్ అంటేనే లాజిక్స్ అని నరేన్ చెప్తాడు. తరువాత మాయ, నరేన్ కారికో బార్ కు వెళ్తున్నట్లు చెప్తాడు. నరేన్ ఆలోచిస్తూ ఉంటాడు.
కట్ చేస్తే ఇద్దరు కలిసి బార్ లో ఉంటారు. బార్ లో ఒక సింగింగ్ కాంపిటేషన్ పెడుతారు. అందులో పార్టీస్ పేట్ చేయమని మాయాను కరణ్ రిక్వెస్ట్ చేస్తాడు. ఆ పాట వింటుంటే మాయకు తన గతం గుర్తుకు వస్తుంది. తరువాత మాయ పాట పాడుతుంది. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే కరణ్ కు నరేన్ కనిపిస్తాడు. సరిగా చూస్తే అక్కడ నరేన్ ఉండడు. నెక్ట్స్ సీన్లో మాయకు థ్యాంక్స్ చెప్తాడు. తరువాత మాయ వెళ్లిపోతుంది. కరణ్ బాయ్ చెప్పి సుందర్ కు ఫోన్ చేస్తాడు. మాయ ఇంటికి వస్తుంది. పోలీసు వచ్చి కాయిల్ హీటర్ తీసుకువెళ్లారు తారా అని చెప్తుంది. ఫోన్ వస్తుంంది. నరేన్ మాట్లాడుతారు. కరణ్ తో ఎందుకు వెళ్లారు అని అడిగితాడు.. కావాలనే మిమ్మల్ని బయటకు తీసుకెళ్లి, హీటర్ తీసుకెళ్లాడు అని చెప్తాడు.. తరువాత నరేన్ బాధ పడుతాడు. కరణ్ తో బార్ కు వెళ్లిన విషయం టీచర్ తో చెప్పావా అంటే లేదు నేను అతనికేమి స్టూడెంట్ ను కాను అని చెప్తుంది. అతను సాయం చేయడం మానెస్తే అని తారా అడుగుతుంది. మాయ అలా చూస్తూ ఉంటుంది.
నరేన్ ఇంటికి వస్తూ బార్ లో జరిగిన విషయం గుర్తుకు వచ్చి డిస్టర్బ్ గా ఫీల్ అవుతాడు. అదే రోడ్డులో డీజో ప్రాక్టీస్ చేస్తూ.. తన ఫీలింగ్స్ ను కంట్రోల్ లోకి తెచ్చుకుంటాడు. నెక్ట్స్ సీన్లో ల్యాబ్ లో హీటర్ ను చెక్ చేసీ ఈ కాయిల్ హీటర్ మ్యాచ్ అవలేదని చెప్తాడు. దాంతో ఈ కేసుకు మాయకు ఏం సంబంధం లేదని ఆఫీసర్ తో చెప్తాడు కరణ్. తరువాత మాయ కేఫ్ కు వచ్చి కరణ్ మాట్లాడుతాడు. తాను ముంబైకి వెళ్తా అని చెప్తాడు. దాంతో మాయ అక్కడినుంచి వెళ్లిపోతుంది. అక్కడికి ప్రేమ వచ్చి కరణ్ తో మాట్లాడుతుంది. మీరు అప్పుడప్పుడు వచ్చి తనను అలా బయటకు తీసుకొని వెళ్లండి అని చెప్తుంది. తనకోసం ఒక టీచర్ తప్ప ఎవరు రారు అని ప్రేమ అంటుంది. నరేన్ రోజు ఇక్కడికి వస్తాడు అని కూడా చెప్తుంది. దాంతో కరణ్ కు డౌట్ వస్తుంది. కరణ్ బయటకు వస్తూ నరేన్ పై డౌట్ పడుతాడు. వెళ్లి స్కూల్ లో రిజస్టర్ ను చూస్తే 10 తేదీన నరేన్ లీవ్ లో ఉన్నట్లు తెలుస్తుంది. దాంతో కరణ్ డీజో ప్రాక్టీస్ చేస్తున్న చోటుకు వెళ్తాడు. మాట్లాడాలి అని ఇద్దరూ నడుచుకుంటు మాట్లాడుకుంటారు. వారి మాటల మధ్యలో ఇద్దరు డీజో ప్రాక్టీస్ చేస్తారు. ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. తాను మాయ వెనుక ఎవరో ఉన్నారు అని చెప్తాడు. తరువాత 10 వ తేదిన నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దానికి ఇంట్లోనే ఉన్నా వంట్లో బాగలేదు అని చెప్తాడు నరేన్. మధ్యలో వారి మధ్య ఫైట్ జరుగుతుంటుంది. ఇక ఆ మర్డర్ గురించి మాట్లాడుతూ… అజిత్ ముఖాన్ని చింతడి చేయడం, బట్టలను సగమే తగలబెట్టడం వెనుక రహస్యం ఏంటని అడుగుతాడు. దానికి మీరే కనిపెట్టండి అని నరేన్ చెప్తాడు.
తరువాత సీన్లో మాయ నరేన్ తో మాట్లాడుతుంది. తన స్టాఫ్ నరేన్ గురించి మాట్లాడరని, తన గురించే రోజు కేఫేకి వస్తుంటారని, తనను ప్రేమిస్తున్నారని ఇలా చాలా మాట్లాడారు అని .. నీకు ఇలాంటిది ఏం లేదు కదా అని అంటుంది. మీమ్మల్ని ఈ మాటలతో బాధ పట్టింటే సారీ అని చెప్తుంది. దానికి ఏం పర్లేదు అని నరేన్ అంటాడు. మీరు ఈ కేసు నుంచి బయట పడాలి అంటే అసలు ఏం తెలియనట్లు ఉండండి అని చెప్పి తన రూమ్ కు వెళ్లి డోర్ వెసుకొని చాలా బాధ పడుతాడు.. ఏడుస్తాడు. తరువాత తను ఒక లెటర్ రాస్తాడు. అలాగే ఒక నోట్ కూడా రాస్తాడు. తను సాల్వ్ చేసిన బుక్స్ ను ఒక సారి చూసుకొని, ఆ లెటర్స్ ను మాయా ఇంట్లో వేసి స్కూల్ కు వెళ్తాడు. దీపక్ తో మళ్లీ గేమ్ ఆడుదాము అని అంటాడు. ఈ సారి దీపక్ గెలుస్తాడు. సంతోషంగా ఉంటాడు. నరేన్ మాత్రం కూల్ గా నవ్వుతాడు.
నెక్ట్స్ సీన్లో కరణ్, సుందర్ ఇద్దరు మాట్లాడుకుంటారు. మాయనే హత్య చేసి బాడీని మాయం చేయడానికి ఎవరో హెల్ప్ తీసుకుంది అని ఆలోచిస్తుండగా.. అక్కడి పోలీసు వచ్చి త్వరగా రండి అని చెప్తాడు. కట్ చేస్తే నేను అజిత్ మాత్రేను చంపింది అని నరేన్ ఒప్పుకుంటాడు. నేను ఇదంతా మాయ చెప్తేనే చేశాను అని చెప్తాడు. కట్ చేస్తే కరణ్ మాయ దగ్గరకు వెళ్లి మీరు అర్జెంట్ గా పోలీసు స్టేషన్ కు రావాలి అని చెప్తాడు. 10 తేదినా అజిత్ బిల్డింగ్ బయట తెగ తిరుగుతున్నాడని నరేన్ చెప్తాడు.
మరో పక్క నరేన్ ఎందుకు అజిత్ ను చంపాలి అని మాయ అడుగుతుంది. ఇద్దరిని సపరేట్ గా ఇంటారగేట్ చేస్తారు… నరేన్ అజిత్ తో మాట్లాడినట్లు అతను మాయ హస్బెండ్ అని ఆ విషయం మాయ చెప్పినట్లు చెప్తాడు. కాని మాయ అలాంటిది ఏం లేదని చెప్తుంది. దానికి నరేన్ తో కరణ్ ఇంతకు ముందుకు తనగురించి ఏం తెలియదు అని చెప్పావు అంటాడు. మేము అలానే చెప్పుకుంటాము అది మా కోడ్ అని చెప్తాడు నరేన్. తాను మాయ బాడీగార్డ్ అని తనను రక్షించడం తన బాధ్యత అంటాడు. అజిత్ ను కలువగానే మయ ఒక చోటుకు వెళ్లిందని చెప్పాను.. దాంతో ఆ ముర్ఖుడు ఆ నిర్మాణం ప్రదేశంలో మాయను వెతుకుతున్నాడు. అదే సమయంలో కాయిల్ హీటర్ తో తల వెనుకాల కొట్టాను, ఆ వయెర్ తో పీక పిసికాను, రాయితో ముఖం చిత్తడి చేశాను. ఫింగర్ ఫ్రింట్స్ కాల్చేశాను అని చెప్తాడు. తరువాత బాడీని కాల్చేశాను అని అంటాడు. దీనికి డాక్టర్ కూడా అతనే అని చెప్తాడు.
మాయతో నువ్వు ఎలా మాట్లాడుతావు అంటే తన ఇంటి గోడకు ఉన్న కన్నం గుండా మాట్లాడుకుంటారని చెప్తాడు. బ్రూస్లీ పోస్టర్ వెనుకాల గోడకు కన్నం ఉంటుంది. ఆమె తన కూతురుతో చెప్తున్నట్లుగా అన్ని నాతో చెప్తుంది అని అరుస్తూ గట్టిగా చెప్తాడు నరేన్. ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని కరణ్ అడుగుతాడు. ఎందుకంటే తాను నాకు ద్రోహం చేసింది అని నరేన్ అంటాడు. ఆ ద్రోహం ఏంటని అడిగితే కరణ్ వైపు చూస్తాడు. కరణ్, మాయ బార్ లో మీరు డ్యాన్స్ చేస్తుంటే చూశాను అని చెప్తాడు. అవును తాను నన్ను ప్రేమిస్తున్నాడని చెప్తుంటే విన్నాను… కాని అతను ఇంత దూరం వెళ్తాడు అనుకోలేదు అని చెప్తుంది. ఇక తనకు ఎవరో లెటర్స్ రాసేవారని కొన్ని లెటర్లను చూపిస్తుంది. నరేన్ ఇల్లు చెక్ చేస్తే.. తన బట్టతల ప్రాబ్లమ్స్ కు నెట్ సెర్చ్ చేసినట్లు, కరణ్ నిన్ను ఎప్పటికి క్షమించను అని లెటర్ ప్యాడ్ కనిపిస్తాయి. ఇక తన ఇంట్లో ఉన్న హీటర్ ను తీసుకెళ్లి టెస్ట్ చేస్తే అందులో వున్న స్కిన్ అజిత్ బాడీతో మ్యాచ్ అయినట్లు డాక్టర్స్ చెప్తారు.
ఇదే విషయాన్ని కమిషనర్ తో కరణ్ చెప్తాడు కరణ్.. మాయకు సైడ్ అంతా క్లియర్ గా ఉందని, నరేన్ ఒక జీనియస్ అని, పిచ్చివాడికి జీనియస్ ఒక చిన్న లైన్ మాత్రమే తేడా ఉంటుంది అని చెప్తాడు. దాంతో నరేన్ పై మర్డర్ చార్ట్ షీట్ వేయండి అని కమిషనర్ చెప్తాడు. తరువాత మాయను వెళ్లిపో అని చెప్తాడు కరణ్.. నరేన్ జైల్లో కూర్చొని ఉంటాడు. నేనూ టీచర్ తో ఒక సారి మాట్లాడాలి అని వెళ్తుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతుంది. నా ప్రాణాలు కాపాడిన మీకు ఈ మాత్రం చేయకపోతే ఎలా అని అంటాడు. మీరు మొదటి సారి నా ఇంటికి రావడం మీకు గుర్తుందా ఆ రోజు నేను ఉరివేసుకోవాలి అనుకున్నాను. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 10 సంవత్సరాలు కష్టపడ్డా అని, అది సాల్వ్ చేసిన తరువాత తెలసింది.. 40 గంటల ముందే దాన్ని సాల్వ్ చేశారని.. తట్టులేకపోయాను అని చెప్తాడు. ఇంకో ప్రాబ్లమ్ ఉందని దాన్ని సాల్వ్ చేయడానికి 15 సంవత్సరాల టైమ్ పడుతుందని, పూర్తి సమయం దానికే కెటాయిస్తాని అని మాయాతో అంటాడు. నువ్వు తారా ఇద్దర సంతోషంగా ఉండండి అని చెప్తాడు. నరేన్ కు థ్యాంక్స్ చెప్తుంది. అంతలోనే నరేన్ గట్టిగా అరుస్తాడు. పిచ్చి పట్టినట్లు యాక్టింగ్ చేస్తాడు. కరణ్ వచ్చి మాయను తీసుకొని వెళ్లిపోతాడు.
మాయ వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లి తారతో మాట్లాడుతుంది. నిన్ను నా నుంచి ఎవరు దూరం చేయలేరు టీచర్ అన్నింటిని సరి చేశాడు అని చెప్తుంది. జైల్లో ఉన్న టీచర్ అసలు బాడీని ఎలా తప్పించాడో రివీల్ అవుతుంది. అజిత్ చనిపోయింది 9 వ తేదీ అని ఆ రోజు అన్ని మాయకు వ్యతిరేకంగా ఉన్నాయి అని 10 తారీఖునా అజిత్ చనిపోతే ప్రాబ్లమ్ సాల్వ్ అని ప్లాన్ చేస్తాడు. అజిత్ పోడుగు ఉన్న ఒక పిచ్చోడికి డబ్బులు ఇచ్చి హోటల్ కు తీసుకుపోయి, అతనికి ఫుల్ గా తినిపించి, తాపించి హీటర్ తో కొట్టి అతన్ని హత్య చేసి, ముఖం చిత్తడి చేసి, ఫింగర్ ప్రింట్స్ కాల్చేసి. అతన్ని తగలబెట్టి అక్కడ అజిత్ ఆధారాలు వదిలేసి వెళుతాడు. ఇక జైల్లో నరేన్ తన ప్రాబ్లమ్ ను సాల్వ్ చేసుకుంటూ గడుపుతాడు. ఇది జానే జాన్ మూవీ స్టోరీ..