రాఘవ లారెన్స్ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. హర్రర్ కామెడీని వదిలి ఇప్పుడిప్పుడే యాక్షన్ జోనర్లో సినిమాలు చేస్తున్నారు. ఈ తరుణంలో సూపర్ హిట్ సినిమా జిగర్ తండాకు సిక్వెల్‌గా జిగర్ తండా డబుల్ ఎక్స్ మూవీలో నటించారు. ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Raghava Lawrence Jigar Thanda Double X Telugu Movie Review
సినిమా: జిగర్ తండ డబుల్ ఎక్స్ నటీనటులు: రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య,షైన్ టామ్ చాకో, నిమిషా సజయన్. నవీన్ చంద్ర, సత్యన్, అరవింద్ ఆకాశ్, ఇళవరసు, బావ చెల్లదురై తదితరులు. దర్శకత్వం: కార్తిక్ సుబ్బరాజు నిర్మాతలు: కార్తేకేయన్ సంతానం, ఎస్. కతిరేసన్, అలంకార్ పాండియన్ సినిమాటోగ్రఫి: తిర్రు సంగీతం: సంతోష్ నారాయణ్ ఎడిటర్: షఫీక్ మహమ్మద్ అలీ విడుదల తేదీ: నవంబర్ 10, 2023
Jigar Thanda Double X Review: రాఘవ లారెన్స్ హీరోగా, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రలో తాజాగా విడుదలైన చిత్రం జిగర్ తండా డబుల్ ఎక్స్. 2014లో వచ్చిన జిగర్ తండా సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. మరీ ఆడియెన్స్ అంచనాలను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
1975 లో ఒక థియేటర్ దగ్గర ఒక పాండియన్ (లారెన్స్)కు ఒక గొడవ జరుగుతుంది. ఆ ఘటనతో అతడు హీరోగా మారాలి అనుకుంటాడు. తాను బ్లాక్ ఉంటాడు. పాండియన్ హీరో అవుతాను అనడంతో అక్కడ ఉన్న వారు నవ్వుతారు. దాంతో పాండియన్ తాను ఇండస్ట్రిలోనే మొదటి నల్ల హీరో అవాలి అని ఫిక్స్ అవుతాడు. ఈ క్రమంలోనే తనను హీరోగా పెట్టి సినిమా తీసే డైరెక్టర్ కోసం వెతుకుతూ ఉండగా అదే సమయంలో సత్యజిత్ రే దగ్గర అసిస్టేంట్‌గా పనిచేసిన రే దాసన్(ఎస్ జె సూర్య) దొరుకుతాడు. సినిమా అంటే ఇష్టం, ఫ్యాషన్ ఉండే ఎస్ జె సూర్య ఒక సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకుని పెద్ద డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అదే సమయంలో పాండియన్‌తో సినిమా చేయమని ఇతడిని బెదిరిస్తూ ఉంటాడు. ముందుగా ఒప్పుకోక పోయిన ఆ తర్వాత రౌడీతో సినిమా అంటే కొత్తగా ఉంటుంది అనే ఒప్పుకుంటాడు. సినిమా చేస్తున్న సమయంలో పాండియన్ వలన ఇబ్బందులు తలెత్తుతాయి. అలాంటి పరిస్థితుల్లో సినిమాను ఎలా పూర్తి చేస్తారు. పాండియన్ ఎలా మంచి వ్యక్తిగా మారుతాడు. సినిమా విడుదల అయిందా లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
దాదాపు పదేళ్ల తర్వాత జిగర్ తండా సినిమాకు సీక్వెల్‌గా జిగర్ తండ డబుల్ ఎక్స్ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అద్భుతంగా డీల్ చేసాడు. స్టోరీ పెద్దగా లేకపోయినా డైరెక్టర్ కథ నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే తో సినిమా నడిపించిన విధానం ఆకట్టుకుంది. విలన్ పాత్రలో లారెన్స్ అద్భుతంగా చేశాడు. సినిమా ఫస్ట్ చాలా ఫాస్ట్‌గా మెయిన్ పాయింట్లోకి వెళ్లి ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇక ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంటుంది. తరువాత సెకండ్ ఆఫ్‌లో కొంత ల్యాగ్ ఉన్నప్పటికి ఇంట్రెస్టింగ్ గానే సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి వేగం పుంజుకుంటుంది. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులు సీట్లో కూర్చోరు. తరువాత ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి.
ఎవరెలా చేశారు:
లారెన్స్ రౌడీ పాత్రలో అద్భుతంగా నటించాడు. మాములుగా హర్రర్ సినిమాలో కామెడీ చేస్తూ నవ్వించే లారెన్స్ ఈ సినిమాలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో ఒదిగిపోయాడు. నటించడానికి స్కోప్ ఉన్న క్యారెక్టర్లో ఎస్ జె సూర్య కెరీర్ లోనే బెస్ట్ ఫార్ఫార్మెన్స్ ఇచ్చాడు అని చెప్పవచ్చు. తరువాత నవీన్ చంద్ర కూడా తన పాత్రకు తగ్గట్టుగా నటించాడు.
సాంకేతిక అంశాలు:
ఈ సినిమాలో స్టోరీ లేకపోయినా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తన ఎఫర్ట్ మొత్తం పెట్టి కథ స్క్రీన్ ప్లే తోనే నడిపించి వావ్ అనిపించాడు. ఈ సినిమాలో మేజర్ ఎలిమెంట్స్ ను అద్భుతంగా పండించారు. మొదటి పార్ట్ రేంజ్ లో లేకపోయినా సీక్వెల్ కూడా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ సాంగ్స్ పర్వాలేదు అనిపించినా బీజీఎమ్ మాత్రం అద్భుతంగా ఇచ్చాడు.
తిర్రు సినిమాటోగ్రఫీ బాగుంది. 1975 సమయంలో తన విజువల్స్ ను చాలా బాగా క్రియేట్ చేసారు. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి.