గోపీచంద్ నటించిన తాజా చిత్రం భీమా. టీజర్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్‌కు భీమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో చూద్దాం.
చిత్రం: భీమా నటీనటులు: గోపీచంద్, ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ, నరేష్, వెన్నెల కిషోర్ తదితరులు దర్శకుడు: ఏ హర్ష నిర్మాత: కెకె రాధామోహాన్ సంగీతం: రవి బస్రూర్ సినిమాటోగ్రాఫర్: స్వామి జే గౌడ ఎడిటర్: తమ్మిరాజు విడుదల: 08/03/2024
కథ
బెంగళూరులోని బాదామి పరిసరప్రాంతంలో జరిగే కథ ఇది. మహేంద్రగిరిలో భవాని (ముఖేష్ తివారి) ఏది చెప్పినా సాగుతుంది. ఎదురు తిరిగితే పోలీసులైనా సరే వారిని చంపేస్తాడు. అదే సమయంలో చెక్ పోస్ట్ దగ్గర తన ట్యాంకర్ల జోలికి వచ్చిన ఒక ఎస్సై (కమల్ కామరాజు)ను చంపేస్తాడు. దాంతో ఆ గ్రామానికి భీమా (గోపీచంద్) ఎస్సైగా వస్తాడు. వచ్చీ రావడంతో భవానీకి వార్నింగ్ ఇచ్చి అతని మనుషులను టార్గెట్ చేస్తాడు. అదే సమయంలో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పరశురామక్షేత్రంలో ఊహించని ఘటనలు జరుగుతుంటాయి. అలాగే భవాని ట్యాంకర్ల రహాస్యం గురించి భీమా తెలుసుకుంటాడు. ట్యాంకర్ల రహస్యం ఏమిటి? పకృతి వైద్యుడు రవీంద్ర వర్మ (నాజర్) ఏం చేశాడు? విద్య (మాళవికా శర్మ)కు భీమాకు సంబంధం ఏంటి? రామా (గోపీచంద్), పారిజాతం (ప్రియా భవానీ శంకర్) ఎవరు? మహేంద్రగిరిలోని పరశురామ క్షేత్రంలో ఐదు దశాబ్దాలుగా మూత పడిన శివాలయానికి సంబంధం ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎలా ఉందంటే
ఇంతకు ముందు గోపిచంద్ నటించిన పోలీస్ సినిమాలకు, భీమాకు చాలా వ్యత్యాసం ఉంది. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉండడం వలన కథ చాలా ఆసక్తిగా సాగుతుంది. అయితే కథ స్టార్టింగ్, ఎండింగ్ చాలా ఆసక్తిగా ఉన్నా.. మధ్యలో కమర్షల్ హంగులు ఉన్నాయి. ఫస్ట్ హాప్ మొదటి పదిహేను నిమిషాలు పరశురామ క్షేత్రం, దాని మహిమలు గురించి చెప్తారు. అప్పుడు కథమీద ఆసక్తి కలుగుతుంది. ఆ తరువాత హీరో ఎంట్రీ ఉంటుంది. తరువాత పూర్తి కమర్షల్ ఫార్మెట్లో కథ సాగుతుంది. మళ్లీ ప్రీ క్లైమాక్స్ వరకు మళ్లీ గుడి ప్రస్తావన ఉండదు. కథలో లవ్ ట్రాక్ పెద్దగా ఆకట్టుకోలేదు. కామెడీ పెద్దగా లేదు. ఇక సెకండ్ హాఫ్ కూడా ఇద్దరి గోపిచంద్ కథలు, వారి జీవితంలోని లవ్ ట్రాక్స్ చూపిస్తారు. సోషియో ఫాంటసీ పాయింట్‌తో ఈ కథ రాసుకోవడం మంచి ఆలోచనే. అయితే దాన్ని తెరకెక్కించడంలో ఆసక్తి కలిగించే విషయాలను పెద్దగా రాసుకోలేదు. అయతే రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు సినిమా చూస్తాడు. ఇక ప్రీక్లైమాక్స్ రాగానే సినిమాకు మళ్లీ ఊపు వస్తుంది. అది క్లైమాక్స్ వరకు ఉంటుంది. ఇంకాస్త దృష్టిపెట్టుంటే మరో రేంజ్లో ఉండేది.
ఎవరెలా చేశారు
రెండు పాత్రల్లో గోపీచంద్ మెప్పించారు. ఆయన నటన ఆకట్టుకుంది. రెగ్యూలర్ పోలీసు పాత్రలో తనదైన నటనతో ప్రేక్షకుడిని కట్టిపడేసినా, రామ పాత్రలో అద్భుతంగా చేశారు. అలాగే హీరోయిన్స్ తమ పాత్రల పరిది మేరకు నటించారు. డిసెంట్‌గా యాక్ట్ చేశారు. అలాగే చాలా రోజుల తరువాత మళ్లీ తెలుగులో కనిపించిన ముఖేష్ తివారి నటనతో ఆకట్టుకున్నారు. ఇలాంటి పాత్రలు చేయాలంటే ముఖేషఫ్ తివారి మాత్రమే అనేలా ఫార్ఫార్మెన్స్ ఇచ్చారు. నాజర్ తన బెస్ట్ ఇచ్చారు. మిగితా నటీనటులు సైతం తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతి అంశాలు
రవి బస్రూర్ పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ నేపథ్య సంగీతం అద్బుతంంగా ఉంది. యాక్షన్ సీన్లకు బీజీఎమ బావుంది. గోపీచంద్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది. స్వామి జె గౌడ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫస్ట్ హాఫ్‌లో కొన్ని కమర్షల్ సీన్లు ఎడిటింగ్‌లో లేపేస్తే బాగుండు.