»Raghava Lawrence As The Villain In Rajinikanths Next Movie
Lawrence: రజనీకాంత్‌తో తలపడనున్న రాఘవ లారెన్స్?
సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ ఆయన నెక్ట్స్ సీనిమాలో విలన్‌గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విలన్ పాత్రకు చాలా ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది.
Raghava Lawrence as the villain in Rajinikanth's next movie?
Lawrence: తమిళ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్(Rajanikanth) ప్రస్తుతం రెండు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జైలర్(Jailer) చిత్రంతో బాక్స్ఆఫీస్ వద్ద ఆయన విశ్వరూపాన్ని చూపించి కాసుల వర్షం కురిపించారు. చాలా కాలం తరువాత సరైన మాస్ సినిమా పడడంతో ఆయన సత్తా ఏంటో మరో సారి నిరుపించాారు. ఓటీటీలో కూడా జైలర్ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఆయన జై భీమ్ డైరెక్టర్ జ్ఙానవేల్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. దీని తరువాత సెన్సెషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj)తో మరో సినిమా పట్టాలెక్కనుంది.
యాక్షన్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను కూడగట్టుకున్న డైరెక్టర్ లోకేష్, రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా ప్రకటించగానే తలైవా అభిమానులు పండుగ చేసుకున్నారు. ఈ సినిమా కచ్చితంగా స్పెషల్‌గా ఉంటుందని వారు భావిస్తున్నారు. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రంలో రాఘవ లారెన్స్(Raghava Lawrence) నటించనున్నాడు. ఆయన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడని కోలివుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. లోకేష్ చిత్రాల్లో హీరో పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో విలన్ పాత్రలకు అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో కూడా సరికొత్త విలన్ పాత్ర ఉంటుందట, అందుకోసం లారెన్స్ సరిపోతాడని డైరెక్టర్ భావిస్తున్నారట. ఇప్పటికే డైరెక్టర్‌గా, యాక్టర్‌గా మెప్పించిన లారెన్స్ ఇప్పుడు విలన్‌గా సిద్ధం అయ్యాడు. లారెన్స్ ఎలాగో రజనీకి వీరాభిమాని, ఇక ఇలాాంటి అవకాశం రావడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయని తెలుస్తోంది. చూడాలి మరీ చిత్ర యూనిట్ ఎప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందో.