ATP: గుంతకల్లు ఆంధ్రప్రభ రిపోర్టర్ నాగరాజు సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. విషయం తెలుసుకున్న జర్నలిస్టు సంఘాల నాయకులు నాగరాజు భౌతికాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సంతాపం వ్యక్తం చేశారు. నాగరాజు గత రెండు ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడినట్లు బంధువులు తెలిపారు.