హ్యాంగోవర్ తగ్గాలంటే శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడం చాలా ముఖ్యం. మద్యం వల్ల కలిగే డీహైడ్రేషన్‌ను తగ్గించాలంటే.. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లు ఎక్కువగా తీసుకోవాలి. అల్లం టీ తీసుకోవడం వల్ల వికారం, వాంతులు తగ్గుతాయి. అరటిపండు తినడం వల్ల శరీరానికి అవసరమైన పొటాషియం అందుతుంది. తేలికపాటి ఆహారం తీసుకుంటూ.. తగినంత విశ్రాంతి తీసుకుంటే బాడీ యాక్టివ్ అవుతుంది.