సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. రెవెన్యూ డివిజన్, తహసీల్దారు కార్యాలయాలు, పురపాలికలు, మండల కేంద్రాల్లోనూ అధికారులు ప్రజల వినతులు స్వీకరిస్తారని చెప్పారు. ప్రజలందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.