JGL: మద్దులపల్లి గ్రామ పెద్ద చెరువు అలుగు పారుతుంది. చెరువులోకి ఎస్సారెస్పీ కాలువ నీటితో పాటు వరద కాలువ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతుండటంతో ఆదివారం సాయంత్రం చెరువు పూర్తిస్థాయిలో నిండింది. మద్దులపల్లి చెరువు ద్వారా కింద ఉన్న లింగాపూర్ చెరువులోకి నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వేసవి పంటలకు ఇబ్బందులు ఉండవని అన్నారు.