యానిమల్ మూవీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి నేపథ్యంలో ముంబైలో అర్ధరాత్రి 2 గంటల వరకు.. అలాగే ఉదయం 5.30 గంటలకు కూడా స్పెషల్ షో వేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్‌లో షేర్ చేశారు.
Animal: ప్రముఖ దర్శకుడు యానిమిల్ (Animal) మూవీపై వరసగా పోస్టులు చేస్తూనే ఉన్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో దర్శక దిగ్గజం రాజమౌళి సందీప్ రెడ్డి వంగాను రామ్ గోపాల్ వర్మతో పోల్చారు. ఆ తర్వాత మూవీకి హైప్ రావడం.. వర్మ కూడా స్పందించడం చకచకా జరిగిపోయాయి. మూవీ కూడా హిట్ అయ్యింది. కలెక్షన్లలో దూసుకెళుతోంది.
మూవీ చూసిన తర్వాత వర్మ (varma) మూడు పేజీల రివ్యూ రాశాడు. సందీప్ నీ కాళ్ల ఫోటో పంపు దండం పెడతా అంటూ పేర్కొన్నాడు. దానికి సందీప్ కూడా రిప్లై ఇచ్చాడు. మీ లాంటి వారు ప్రశంసించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాసేపటి క్రితం యానిమల్ మూవీ పోస్టర్‌తో ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు వర్మ. ముంబైలో మూవీకి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని.. ప్రేక్షకుల నుంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో మిడ్ నైట్ షో కూడా ప్రదర్శిస్తున్నారని అందులోని సారాంశం.
ప్రేక్షకుల నుంచి ఆదరణ వస్తోన్న నేపథ్యంలో అర్ధరాత్రి 2 గంటల వరకు షో ప్రదర్శిస్తున్నారని వర్మ పేర్కొన్నారు. అలాగని ఉదయం 10, 11 గంటలకు షో ప్రారంభం కావడం లేదు. మళ్లీ ఉదయం 5.30 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ముంబై మాక్సస్ సినిమాలో రాత్రి 1, 2 గంటలకు ఉదయం 5.30 గంటలకు షో చేర్చారని తెలిపారు. గోరెగావ్‌లో గల పీవీఆర్ ఓబెరాయ్ మాల్, అందేరిలో గల పీవీఆర్ సిటీ మాల్లో కూడా రాత్రి 12.30 గంటలు, రాత్రి 1.05 గంటల షో యాడ్ చేశారని తెలిపారు.
ఇటు యానిమల్ వసూళ్లతో దూసుకెళుతోంది. ఇప్పటికే మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.425 కోట్లు కలెక్ట్ చేసింది. 5 రోజుల్లోనే ఈ మొత్తం కలెక్షన్ల వర్షం కురిసింది. మూవీకి ఉన్న క్రేజ్ చూస్తే ఈజీగా రూ.వెయ్యి కోట్ల కలెక్షన్లు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.