PLD: బెల్లంకొండ మండలం పాపాయిపాలెం గ్రామంలో దారుణం జరిగింది. స్థానికుడైన ఓర్చు కృష్ణయ్యపై గోపాలకృష్ణ అనే వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో కృష్ణయ్యకు తీవ్ర రక్తస్రావమైంది. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.