కులీ కుతుబ్‌షా 1591లో నిర్మించిన చార్మినార్, హైదరాబాద్‌కు ముఖచిత్రంగా నిలిచింది. అయితే, అచ్చం ఇలాంటి నిర్మాణమే పాకిస్తాన్‌లోని కరాచీలో కూడా ఉంది. HYD సంస్థానం భారత్‌లో విలీనం అయిన తర్వాత చాలా మంది ముస్లింలు పాక్‌కు వలస వెళ్లారు. అయినప్పటికీ, వారికి చార్మినార్‌పై ఉన్న అభిమానంతో.. 2007లో అదే నమూనాతో ‘చార్మినార్ చౌరాంగీ’ని అక్కడ ఏర్పాటు చేశారు.