‘కొత్త లోక’ సినిమాతో నటి కళ్యాణి ప్రియదర్శన్ మంచి ఫేమ్ తెచ్చుకుంది. తాజాగా మరో విభిన్న పాత్రతో ప్రేక్షకులను అలరించేందుకు కళ్యాణి సిద్ధమవుతుంది. తమిళ హీరో కార్తీ నటిస్తోన్న ‘మార్షల్’ మూవీలో ఆమె పెక్యులర్ రోల్లో కనిపించనుంది. ఈ సినిమాలో ఆమె పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందట. ఇక ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం.