AP: మంగళగిరి APIIC కార్యాలయం వద్ద ఎస్సీ పారిశ్రామికవేత్తలు ధర్నా చేపట్టారు. MSME సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆందోళన సందర్భంగా ఒక మహిళ స్పృహ తప్పి కింద పడిపోయారు. తాము గత ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నప్పటికీ, అధికారులు, నాయకులు తమను పట్టించుకోవడం లేదని ఎస్సీ పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.