VZM: ఈ నెల 7వ, తేదిన జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో ఇవాళ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి సాయుధ దళాల పతాక నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న సైనికులకు, మాజీ సైనికులకు వారి కుటుంబ సభ్యులకు పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.