GDWL: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా గద్వాల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో సోమవారం జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ సరిత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కొత్తపల్లి సర్పంచ్ అభ్యర్థి ఉమ సంజీవ్ ముదిరాజు గెలిపించాలని ఆమె కోరారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఆమె వివరించారు.