ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ తన కెరీర్లోనే భీకర ఫామ్‌లో ఉన్నాడు. అతడి ధాటికీ యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఈ సిరీస్‌లో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ అతడే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌కు ముందు WIతో జరిగిన టెస్టులో కూడా స్టార్కే ఈ అవార్డును దక్కించుకున్నాడు.