ASF: తిర్యాణి మండలం సుంగపూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు దుర్గం రాజయ్య (52) అప్పుల బాధతో పురుగు మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. గత ఏడాది కూతురి పెళ్లి, ఈ ఏడాది 10 ఎకరాల కౌలు భూమిలో పత్తి పంటకు పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరిగాయి. దిగుబడి సరిగ్గా లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు