SRPT: చివ్వెంలలో 20 మంది బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి నాయకులు చేరుతున్నారని సర్వోత్తమ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ వేణారెడ్డి, మండల అధ్యక్షుడు ధరావత్ వీరన్న పాల్గొన్నారు.