వరంగల్ పోతననగర్లోని సెకండరీ ట్రాన్స్ఫర్ స్టేషన్ను మేయర్ గుండు సుధారాణి బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. చెత్త తరలింపులో జాప్యం లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. స్వచ్ఛ ఆటోల మరమ్మత్తులు వేగంగా పూర్తి చేసి వాహనాల అందుబాటును నిర్ధారించాలని సూచించారు. తడి–పొడి చెత్త వేరు చేసే ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని కూడా ఆమె తెలియజేశారు.