KMR: బీబీపేట్ మండలం రాంరెడ్డిపల్లికి చెందిన కోక్కోల సత్యం (50) భూతగాదాల వల్ల హత్యకు గురయ్యా డని ఎస్సై విజయ్ తెలిపారు. అదే గ్రామానికి చెందిన లచ్చయ్య వ్యవసాయ భూమి పక్కపక్కనే ఉండటంతో గత కొంతకాలంగా భూ విషయంలో తగాదాలు నడుస్తున్నాయని చెప్పారు. దీంతో లచ్చయ్య, కొకోళ్ల సత్యంను కర్రతో కొట్టి దారుణంగా హత్య చేశాడన్నారు.