ADB: భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలను కోరారు. రెండవ విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా జైనథ్ మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు.