KKD: తుని మున్సిపాలిటీ తొలి మహిళా ఛైర్పర్సన్ బొండా రత్నావతి మృతి పట్ల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గురువారం ఆమె ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. రత్నావతి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఆమె మున్సిపల్ అభివృద్ధికి చేసిన సేవలను కీర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శిస్తూ ధైర్యం చెబుతూ నిలబడ్డారు.