హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో గురువారం భూ నిర్వాసితులకు ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. రైల్వే జాక్ ఆధ్వర్యంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరిలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. జాక్ అధ్యక్షుడు దేవులపల్లి రాఘవేంద్రరావు, డాక్టర్ వెంకట్ నారాయణ పాల్గొన్నారు.