ఛత్తీస్గఢ్ పోలీస్ శాఖలో ఓ మహిళా అధికారి వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పెళ్లి చేసుకుంటానని తనను పూర్తిగా దోచేసిందని DSP కల్పనా వర్మపై ఓ హోటల్ ఓనర్ దీపక్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం దంతేవాడ DSPగా ఉన్న కల్పనకు తాను రూ.2 కోట్ల నగదు, టొయోటా కార్, కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చానన్నారు. ఈ మేరకు ఆమెతో చేసిన చాటింగ్స్, ఫొటోలు బయటపెట్టారు. అయితే ఇవన్నీ ఫేక్ అని ఆమె కొట్టేశారు.