GNTR: ఫిరంగిపురం మండల 2వ వైస్ MPPగా అమర్లపూడి అనురాధ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వేములూరిపాడు-2 MPTCగా ఉన్న అమర్లపూడి అనురాధను మిగిలిన ఎంపీటీసీలు గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఉన్న వ్యక్తి చనిపోవడంతో గురువారం కొత్త వైస్ ఎంపీపీని ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆమెకు పలువురు వైసీపీ నాయకులు అభినందనలు తెలిపారు.