విజయనగరం పట్టణం తోటపాలెంలోని శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో విద్యార్థినులతో మహిళ పోలీసు స్టేషను అధికారులు గురువారం మహిళల భద్రత, రహదారి భద్రత, డిజిటల్ అరెస్టులపై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సీఐ నరసింహమూర్తి మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్ధినుల తమ స్మార్ట్ ఫోన్లో శక్తి యాప్ను నిక్షిప్తం చేసుకోవాలని సూచించారు.