SKLM: క్రీడలే విద్యార్థి భవిష్యత్తుకు మూలమని ఎమ్మెల్యే రమణమూర్తి తెలిపారు. మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నియోజకవర్గ స్థాయి స్కూల్ ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.