TG: తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో.. కౌంటింగ్ స్టేషన్ల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. ఓటింగ్ సమయం ముగిసినా.. చాలా ప్రాంతాల్లో వందలమంది క్యూలైన్లలో ఉన్నారు. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించనున్నారు. బ్యాలెట్ పేపర్లను ట్రేలో అమర్చి లెక్కిస్తారు. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పేపర్లను అమర్చుతారు.