KMM: కొణిజర్ల మండలంలోని బోడియా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వడిత్య భద్రకాళి తన ప్రత్యర్థిపై 147 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఈ విజయం నమోదైంది. ఈ విజయం పట్ల కాంగ్రెస్ శ్రేణులు బాణా సంచా కాలుస్తూ.. విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.