MDK: గ్రామ సర్పంచ్ ఎన్నికల ఫలితాల్లో అల్లాదుర్గం మండలం కాయిదం పల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మద్దతుదారు వంకిడి రేణుక గెలుపొందారు. సమీప ప్రత్యర్థి బేతయ్యపై 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, గ్రామస్థులు, అభిమానులు టపాసులు పేల్చి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.