సీనియర్ నటి పావలా శ్యామలా ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమె ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదుకునే వారు లేకపోవడంతో ఆమె జీవనం దయనీయంగా మారింది. తన కూతురితో కలిసి నివాసముంటున్న హోం నిర్వాహకులకు డబ్బు చెల్లించకపోవడంతో వారిని బయటకు పంపారు. దీంతో వారు ఆత్మహత్యకు యత్నిస్తుండగా.. స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఓ స్వచ్ఛంద సంస్థలో చేర్పించారు.