TG: భద్రాచలంలో మహిళా ఓటర్ ఆందోళనకు దిగారు. కోటగిరి లక్ష్మీ పేరుతో అప్పటికే తన ఓటు పోల్ అయింది. దీంతో తన ఓటును చోరీ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అధికారులతో మహిళ బంధువులు వాగ్వాదం పెట్టుకున్నారు. దీంతో మహిళకు అధికారులు టెండర్ ఓటు అవకాశం కల్పించారు. అయితే ఆ ఓటు పరిగణలోకి తీసుకుంటారో లేదో అని ఆమె ఆందోళన చేశారు.