VSP: వర్కింగ్ జర్నలిస్టుల చట్టాలు పునరుద్ధరణ, పెన్షన్, హౌసింగ్ వంటి పెండింగ్ సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ, జనవరి నెలాఖరులో “చలో విజయవాడ” కార్యక్రమం నిర్వహించాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నిర్ణయించింది. ఫెడరేషన్ నేతలు డిజిటల్ ప్రైవసీ చట్టంపై రౌండ్‌టేబుల్ నిర్వహించాలని కూడా సమావేశంలో తీర్మానించారు.