E.G: గోకవరం( మం)రంప ఎర్రంపాలెం ప్రధాన రహదారిలో ప్రమాదం పొంచి ఉంది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో విద్యుత్తు స్తంభం పూర్తిగా క్రింద భాగం ధ్వంసమై, గాలిలో ప్రమాదకరంగా వేలాడుతోంది. విద్యుత్తు తీగలు తెగిపోతాయని భయంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కావున తక్షణమే అధికారులు స్పందించ స్తంభాన్ని పునరుద్దరించాలని పలువురు కోరుచున్నారు.